
ఇప్పటివరకు ఏటాప్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఖర్చుపెట్టని విధంగా 2 కోట్లు ఈవెంట్ కు ఖర్చుపెడుతున్నారు అంటే ఈ మూవీ నిర్మాతలకు మూవీ పై ఎలాంటి నమ్మకం ఉందో అర్థం అవుతుంది. సాధారణంగా సినిమా ఫంక్షన్ కు రాజకీయ నాయకులు లేదంటే టాప్ సినిమా సెలెబ్రెటీలు అతిధులుగా వస్తారు. అయితే దీనికి భిన్నంగా ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా శ్రీచిన్న జీయర్ స్వామిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
‘ఆదిపురుష్’ యూనిట్ మొదటి నుంచి హిందూ ధార్మిక విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తూ తన సినిమా ప్రమోషన్ ను కొనసాగిస్తోంది. హనుమంతుడు కి ఎంతో ప్రీతికరమైన మంగళవారం సెంటిమెంట్ ప్రభాస్ కు గతంలో ఎంతగానో కలిసి వచ్చిన తిరుపతి సెంటిమెంట్స్ ను నమ్ముకుని ఈరోజు జరగబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ‘ఆదిపురుష్’ మ్యానియా తారస్థాయికి చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఐదు భాషలలో విడుదలకాబోతున్న ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి 10 రోజులు పూర్తి అయ్యేసరికి ఈ మూవీకి 1000 కోట్ల గ్రాస్ కలక్షన్ రాబట్టాలాని ఈ మూవీ నిర్మాతల ప్లాన్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శ్రీరాముడు పేరు చెప్పగానే నందమూరి తారకరామారావు సీతాదేవి పేరు వినగానే అంజలీదేవి గుర్తుకు వస్తారు. మరి వారిని మరిపించే విధంగా ప్రభాస్ కృతి సనన్ లు ఎంతవరకు మెప్పించగలరు అన్నది ఈరోజు విడుదలయ్యే ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది..