తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఆఖరుగా వారసు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా వారసుడు అనే పేరుతో తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ సినిమా తమిళ ... తెలుగు బాక్సాఫీస్ ల దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. వారిసు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విజయ్ ప్రస్తుత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ తన తదుపరి మూవీ ని ఇప్పటికే అనౌన్స్ చేశాడు. విజయ్ తన తదుపరి మూవీ ని తాజాగా కస్టడీ అనే సినిమాకు దర్శకత్వం వహించినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయబోతున్నాడు. లియో మూవీ షూటింగ్ పూర్తి కాగానే విజయ్మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. దానితో ఇప్పటికే వెంకట్ ప్రభు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ దర్శకుడు ఈ మూవీ లో విజయ్ సరసన నటించే హీరోయిన్ ని కూడా కన్ఫామ్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో ఖుషి మూవీ లో హీరోయిన్ గా నటించినటువంటి ముద్దుగుమ్మను హీరోయిన్ గా తీసుకోవాలని ఈ మూవీ బృందం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఖుషి సినిమా హీరోయిన్ అంటే భూమికా కాదు ... సమంత కాదు. తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన ఖుషి సినిమాలో జ్యోతిక హీరోయిన్ గా నటించింది. జ్యోతిక నే విజయ్ తదుపరి మూవీ లో తీసుకోవాలి అని వెంకట్ ప్రభు డిసైడ్ అయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: