చాలామందికి జీవితం గడుస్తున్న కొద్ది వారి జీవితం నిస్సారంగా మారి నిర్లిప్తంగా కాలం గడుపుతూ ఉంటారు. వాస్తవానికి వీరేవ్వరు జీవితంలో ఘోరంగా ఓడిపోయిన పరాజితులు కారు. అయినప్పటికీ వీరందరికీ వారు కొనసాగిస్తున్న జీవితం పై పెద్దగా కుతూహలం ఉండదు. అలాంటి వ్యక్తులకు ఎప్పుడు సంపద దరిచేరదు. 


వాస్తవానికి ఇలాంటి వ్యక్తులు తామంతా మనశ్శాంతి తో జీవితం గడుపుతున్నామనే భ్రమలో కాలం గడుపుతూ ఉంటారు. అయితే వీరు లోలోపల మాత్రం తీవ్ర అశాంతితో వారి జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం వారికి కూడ తెలియదు. జీవితానికి సంబంధించిన పరుగు పందెంలో ఈ మనస్తత్వంతో ఉండే వాళ్ళు తమ ముసుగుని తొలగించుకుని జీవితంలో తాము ఏమి కోల్పోతున్నామో తెలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి కనపరచరు.


ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు విజయం వైపు కొనసాగే పయనంలో వెనకడుగు వేయడమే కాకుండా డబ్బు సంపాదన విషయంలో కూడ చాల వెనకడుగుతో కొనసాగుతూ ఉంటారు. జీవితంపట్ల కుతూహలం లేని వ్యక్తులకు ఎటువంటి పనిలో అయినా పట్టుదల చాల తక్కువగా ఉంటుంది. అయినా వారు తమ జీవితంలో అసంతృప్తి లేదు అని చెపుతూ ఉంటారు. దీనినే మనస్తత్వ శాస్త్రంలో ‘హైపోథిటికల్’ తత్వం అని అంటారు. మనిషి సుఖంగా బతకడానికి డబ్బు అక్కరలేదు అని తమకు తాము అభిప్రాయపడే వ్యక్తులు కుటుంబం లేకుండా ఒంటరిగా కూడ బ్రతకవచ్చు అన్న వాస్తవాన్ని అంగీకరించరు. 


జీవితం పై ఆశ లేనివారికి వారి జీవితం అంతా దిగులు అబద్రతా భావం ఒంటరి తనంతో గడుస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు అదృష్టం ఉన్నా సంపద దరిచేరదు. మనలను మనం విశ్లేషించుకునే శక్తి లేకపోతే సంపద మన దరి చేరదు. అందుకే ఏ రంగంలో అయినా విజయం సాధించాలి అన్నా ఎంతో ఆశతో ఉండాలి. మన అంతర్గత శక్తులను పటిష్టం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఐశ్వర్యం మన తలుపు తడుతుంది. అందుకే సంపద జీవితానికి ఆశ కలిపిస్తుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: