కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊరట కలిగించేందుకు, పీఎం కిసాన్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ, తమ ఖాతాలో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పథకం రైతన్నల నేస్తం అని చెప్పవచ్చు. ఎన్నో కొన్ని వేల మంది ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే కేవలం అన్నదాతలకు మాత్రమే ఆర్థికంగా చేయూత ను అందివ్వడానికి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త పథకం ఇది . ఇక ఈ పథకంలో సంవత్సరానికి మూడు దఫాలుగా ఆరువేల రూపాయలు అన్నదాతల ఖాతా లో జమ చేయడం జరుగుతోంది.

ఇకపోతే ఇటీవల అందరిలో ఒక సందేహం మెదులుతోంది. అదేమిటంటే, ఒకవేళ ఇంట్లో భార్య , భర్త ఇద్దరికీ పొలం ఉంటే, ఇందులో ఎవరు కిసాన్ పథకం కింద అర్హులు లేదా ఇద్దరూ అర్హులు  అవుతారా ..?అనే సందేహం. పీఎం కిసాన్ పథకం లో  పెట్టిన విధుల ప్రకారం ఒక కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు రావడం జరుగుతుంది. ఒక కుటుంబం అంటే భార్య, భర్త అలాగే వారి ఇద్దరు పిల్లలను కుటుంబం గా పరిగణిస్తారు.

కాబట్టి ఇంట్లో భర్తకు, భార్య కు అలాగే పిల్లలకు భూములు ఉన్నా సరే ,కేవలం ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది.ఒకవేళ పొరపాటున ఈ డబ్బులు భార్యాభర్తలు ఇద్దరూ ఖాతాలో జమ అయినట్లు అయితే , రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటాయి అనే విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. కాబట్టి ఇంట్లో ఎంత మంది ఉన్నా సరే , కేవలం ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: