ఇక మన దేశంలో ఉండేటువంటి ధాన్యాలలో చాలా రకాలు ఉన్నాయని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా గోధుమలు కూడా ఒకటని చెప్పవచ్చు.. గోధుమ పిండిని ఎగుమతి చేయకూడదని ప్రభుత్వం పూర్తిగా వాటిని నిషేధించింది.. నిన్నటి రోజున జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో గోధుమపిండి ఎగుమతులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక గోధుమల ఎగుమతి పై నిషేధించడంతో ఆ తరువాత పిండి ఎగుమతులు భారీగానే పెరుగుతాయని నమ్మకాన్ని తెలియజేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇక ఏడాది ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో పిండి ఎగుమతులు 200 శాతానికి పైగా పెరిగినట్లు సమాచారం.

ప్రభుత్వం ఇప్పటికే అందుకు సంబంధించిన చర్యలు కూడా చేపడుతోంది. పిండి ఎగుమతులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం గతంలో ఎగుమతి పై కొన్ని షరతులను కూడా విధించింది. కానీ ఆ తర్వాత కూడా ఎగుమతులు ఆగడం లేదు.. దీంతో ఇప్పుడు పూర్తిగా ఎగుమతులను నిషేధించారు. పిండి ఎగుమతులు పెరగడం వల్ల గోధుమల ధరలు కూడా మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. ఎందుచేత అంటే ఈ గోధుమలు ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నది.. అయితే పిండి ఎగుమతి పై నిషేధం వల్ల.. గోధుమల సరఫరా పరిమితంగా ఉంటుందనీ.. దీనివల్ల గోధుమల ధరలు మరింత పెరగవచ్చని తెలియజేసింది.

ఇక బియ్యం ధరలు కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయని చెప్పవచ్చు. ఆల్ ఇండియా సగటు రిటైల్ ధర పోయిన సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కిలోపు 6.31 శాతం పెరిగి రూ.37.7 కి చేరుకుంది. ఇక బియ్యం ధరల పెరుగుదలకు కారణాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో వరి నాట్లు 8.25% తగ్గిన నేపథ్యంలో దేశంలో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్న కారణంగా బియ్యం ధరలు పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బియ్యం ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఇది పెను భారంగా మారింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: