కోర్టు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న జంట హర్ష రోషన్, శ్రీదేవి. ఇప్పుడు తాజాగా మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం బ్యాండ్ మేళం. ఈ చిత్రాన్ని రచయిత కోన వెంకట్ కోనా ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పైన డైరెక్టర్ సతీష్ జివ్వాని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య గురువారం (మార్చి 26)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ సినిమా నచ్చకుంటే తాను రచయితగా పనిచేస్తున్నటువంటి చిరంజీవి సినిమాని అసలు చూడవద్దంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కోనా వెంకట్.


స్టోరీ విషయానికి వస్తే:
తెలంగాణలో బ్రాహ్మణపల్లి గ్రామంలో బావ మరదలుగా ఒకే రోజు పుట్టిన జంట హర్ష రోషన్ (యాదగిరి), శ్రీదేవి (రాజీ) చిన్న వయసు నుంచి ఇద్దరు కలిసి పెరగడంతో వీరిద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం. అలా పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే యాదగిరికి మాత్రం చదువు పెద్దగా ఎక్కదు. దీంతో ఒక మ్యూజిక్ బ్యాండ్ క్రియేట్ చేస్తూ కాలాన్ని కడుపుతో ఉంటారు. రాజీ మాత్రం బాగా చదివి టెన్త్ క్లాసులో జిల్లా టాపర్ గా నిలుస్తుంది. పై చదువుల కోసం రాజీ సిటీకి వెళ్లడంతో అలా ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. యాదగిరి మాత్రం తన సొంత ఊరిలోనే స్నేహితులతో కలిసి బ్యాండ్ మ్యూజిక్ తో ఆల్బమ్స్ చేయమని ఆఫర్ రావడంతో నాన్న తిప్పలు పడి ఒక స్టూడియో పెడతాడు. అలా స్టూడియో పెట్టిన రోజే స్టూడియో కాలిపోతుంది. దీంతో తన మరదలు రాజీకి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న తండ్రి సాయన్న ( సాయికుమార్) కానీ వివాహ సమయానికి రాజీ మిస్ అవ్వడంతో, ఆమె లేచిపోయిందనే టాక్ ఊరంతా వినిపిస్తుంది. అసలు రాజీ పారిపోవడానికి కారణం ఏంటి? యాదగిరి, రాజీ కథ కంచికి చేరిందా? లేదా? వీరిద్దరి కెరియర్ బాగుపడిందా లేదా? అనేది ఈ సినిమా కథ.


విశ్లేషణ:
గీతాంజలి మళ్లీ వచ్చిందనే సినిమా తర్వాత నిర్మాతగా కొంత గ్యాప్ తీసుకున్న కోన వెంకట్ రచయితగా పలు కామెడీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా బ్యాండ్ మేళం సినిమాతో మరొకసారి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కోనా వెంకట్. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో బావ మరదల మధ్య సాగే ఒక ప్రేమ కథ చిత్రం బ్యాండ్ మేళం. సినిమా ఆరంభమై ఇద్దరు ఫ్యామిలీల ఆస్తులు తారుమారైన తర్వాత 20 నిమిషాలకు యాదగిరి, రాజీ లవ్ ట్రాక్ మొదలవుతుంది. ఇద్దరి మధ్య కెరియర్ చాలెంజ్, ఇద్దరి మధ్య దూరం పెరగడం ఇదంతా కూడా రొటీన్ గా సాగుతుంది. రాజీ పెళ్లి కుదిరిన ఆపైన లేచిపోవడం, ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయం ఆడియన్స్ ఊహకు తగ్గట్టుగానే కనిపిస్తుంది. అయితే చివరి క్లైమాక్స్లో రాజీ ఇచ్చే ట్విస్ట్ ఆడియన్స్ గ్రహించవచ్చు. ఇందులో ఫ్యామిలీ సీన్స్ అన్నీ కూడా పాత సినిమాలలో గానే కనిపించడంతో కొంత బోర్ ఫీల్ అవుతారు. ముఖ్యంగా బావ మరదల మధ్య లవ్ ట్రాక్ ఏ సీన్ లో కూడా పెద్దగా ఫీల్ ఎమోషన్ లేకపోవడం మైనస్. ఈ సినిమాలో కామెడీ కూడా బలవంతంగా ఇరికించారనే ఫీలింగ్ ప్రేక్షకులలో కనిపిస్తోంది.

నటీనటుల నటన:
యాదగిరిగా (హర్ష రోషన్) నటన అక్కడక్కడ కొంచెం ఓవర్ అనిపించిన యాక్టింగ్ తో బాగానే ఆకట్టుకున్నారు. రాజీ పాత్రలో (శ్రీదేవి) ఒదిగిపోయి మరి నటించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఇందులో స్నేహితులగా నటించిన వారంతా కూడా బాగానే నటించారు. సాయన్నగా (సాయికుమార్)  అద్భుతంగా నటించారు. విలేజ్ అందాలను కూడా చాలా అద్భుతంగా చూపించారు. నిర్మాతగా కోన వెంకట్ ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో కొత్తదనం లేకపోతే అభిమానులను నిరాశ చేసింది.

రేటింగ్:2.4/5

మరింత సమాచారం తెలుసుకోండి: