నందమూరి బాలకృష్ణ అటు సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా మంచి పేరు సంపాదించారు. బాలయ్య ఇప్పటివరకు తన సినీ కెరియర్లో ఎన్నో చిత్రాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. తాజాగా బాలకృష్ణకు ఒక అరుదైన గౌరవం లభించింది. న్యూఢిల్లీలో భరత్ మండపంలో అట్టహాసంగా జరిగినటువంటి అంతర్జాతీయ 2026 ఢిల్లీ చలనచిత్రోత్సవం వేడుకలలో బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు) అందుకున్నారు.


సినిమా రంగంలో 50 ఏళ్లుగా సుదీర్ఘ ప్రస్థానం పూర్తి చేసుకున్న బాలకృష్ణ తన కెరీర్ లో 100కు పైగా చిత్రాలను పూర్తి చేయడమే కాకుండా, ఎన్నో పారాణిక, జానపద, సామాజిక  చిత్రాలలో నటించి తండ్రికి తగ్గ తనయుడుగా మెప్పించడమే కాకుండా మాస్ ఎంటర్టైన్మెంట్ తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను కూడా సృష్టించారు. మార్చి 25న జరిగిన ఈ వేడుకలలో బాలక్రష్ణకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతులతో ఈ అవార్డు అందుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా ఆనందపడుతున్నారు.ఇదే అవార్డు బాలీవుడ్ దిగ్గజ నటి షర్మిల ఠాగూర్ కూడా అందుకుంది. ఈ కార్యక్రమంలో చాలా మంది ఢిల్లీ మంత్రులే కాకుండా కంగనా రనౌత్, మనోజ్ తివారి వంటి సిని ప్రముఖులు కూడా పాల్గొన్నారు.



ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవత్ కేసరి చిత్రానికి 71 వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. బాలకృష్ణ కళా రంగానికి చేసిన కృషికి 2025లో భారత ప్రభుత్వం దేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ తో గౌరవించిన సంగతి తెలిసిందే . బాలయ్య  నటుడుగానే కాకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారు. రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్న బాలకృష్ణ కు వరుసగా ఇలాంటి అవార్డులు రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక సినిమా అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: