ఈ మధ్యకాలంలో ఎవరికైతే బిజినెస్ చేయాలనే ఆలోచన ఉందో అలాంటి వారందరూ.. రిస్క్ తక్కువగా ఉండి.. ఆదాయం ఎక్కువగా ఉండే బిజినెస్ వైపే అడుగు వేయాలి. అప్పుడే నష్టం తక్కువ రావడమే కాదు ఆదాయాన్ని కూడా అధికంగా పొందవచ్చు. ఇకపోతే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం చాలామంది ఆరోగ్యం పై దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఆహారం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోని క్యాటరింగ్ సర్వీస్, హోటల్స్, రెస్టారెంట్ల బిజినెస్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది.


వీటికి డిమాండ్ పెరిగినట్టుగానే డిస్పోజబుల్ ప్లేట్స్ కి  కూడా డిమాండ్ పెరగడంతో.. ప్లాస్టిక్ వైపు మొగ్గు చూపకుండా పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెంచుకొని అటువైపుగా ఫుడ్ సర్వీస్ చేసే డిస్పోజబుల్ ప్లేట్స్ గిన్నెలు వంటి వాటికి ఎక్కువగా డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా పర్యావరణానికి సహకరిస్తూ.. స్థిరమైన ఆదాయాన్ని పొందే దిశగా బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి వాటిలో అరేకా లీఫ్ ప్లేట్స్ తయారీ బిజినెస్ కూడా ఒకటి. వక్క చెట్టు ఆకులతో పర్యావరణ అనుకూలమైన బయోడిగ్రేడబుల్ ప్లేట్లు తయారుచేసి మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

వక్క చెక్క ఆకులను చెట్టు నుంచి వేరు చేసినప్పుడు మట్టల ముందు భాగం మందపాటి కాగితంలా ఉంటుంది. వీటిని ముడి సరుకుగా ఉపయోగిస్తారు.  వీటితో తయారు చేసే ప్లేట్లు ఎటువంటి కెమికల్ లేకుండా నాచురల్ గా రూపొందుతాయి. ఇక ప్రస్తుతం ఈ బిజినెస్ ఏర్పాటు చేయడానికి రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ తో పాటు భూమి, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ వంటి వాటికి ఈ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ఇకపోతే ఫైనాన్షియల్ సపోర్టు కోసం లోన్ కూడా తీసుకోవచ్చు. ఇక మీరు వీటి తయారీ విధానం గురించి తెలుసుకోవాలంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుంచి మొదటి ఐదు సంవత్సరాల ఆపరేషన్ గ్రాస్ సేల్స్ పై వివరణాత్మక అంచనాను అందిస్తోంది. కాబట్టి ఈ వ్యాపారంతో మీకు నష్టం తక్కువ ఆదాయం ఎక్కువ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: