ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు కూడ ఎంతో క్రియేటివిటీతో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం అవుతున్న రోజులలో కొన్ని దశాబ్దాల కాలంనాటి మూస సినిమాను పోలినవిధంగా హీరో గోపీచంద్ నటించిన “ఆరడుగుల బుల్లెట్”  ట్రైలర్ ను చూసిన చాలా మంది  షాక్ అయ్యారు. ఈమధ్య కాలంలో గోపీచంద్ నటిస్తున్న సినిమాలు వరస పరాజయాలుగా మారుతూ ఉన్నా ఈ విషయాలను పట్టించుకోకుండా ఒక మంచి పవర్ ఫుల్ హీరోయిజమ్ తో కూడిన టైటిల్ ను గోపిచంద్  వృధా  చేసుకున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 
వాస్తవానికి ఈ మూవికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ తో ఈ సినిమాకు భవిష్యత్తు ఉంటుంది అన్న ఆశలు కొంతమంది వ్యక్త పరిచారు. అయితే నిన్న విడుదలైన ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ ను చూసిన వారు మాత్రం రవితేజ నటించిన ‘కృష్ణ’, ‘కిక్’, ‘బలుపు’ వంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమాలను కలిపి తీసిన సినిమాలా ఈ ‘ఆరడుగుల బుల్లెట్’ మారబోతోందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాదు ఈ ట్రైలర్ లో మొదలైన ఫస్ట్ షాట్ తోనే ప్రేక్షకులు నీరసించిపోవడం ఖాయం అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.  దీనికితోడు ఈ ట్రైలర్ కు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్  సంగీతం విన్నవారు  నిజంగా దీనికి సంగీతం మణి శర్మ అందించడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా పాటల ట్యూన్స్ విషయంలో ఎలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మణి అద్భుతంగా ఇస్తాడు అన్న నమ్మకాని కూడ ఈ ట్రైలర్ నాశనం చేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనితో వచ్చే వారం మే 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు కనీసం రెండు వారాలు అయినా థియేటర్స్ లో ఆడుతుందా అన్న అనుమానాలను ఈ సినిమా విడుదల కాకుండానే వ్యక్త పరుస్తున్నారు. దీనితో గోపీచంద్ ను పవన్ పవర్ ఫుల్ పాటలోని సెంటిమెంట్ కుడా రక్షించ లేకపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా గోపీచంద్ కు ఈ ఏడాది కూడా కలిసి వచ్చేలా లేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: