ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్య మిస్తున ' ప్రత్యేక  హోదా సాధన సమితి' సభ్యులు నూతనంగా ఒక కార్యక్రమం చేపట్టారు. నవంబరు 20 సోమవారం ఛలో అసెంబ్లీ అంటూ ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కమిటీ . దీనికి మద్దతుగా ప్రతిపక్షమైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్దమైంది ,ఈ సందర్భంగా  తన మద్దతును అఖిలపక్షానికి  తెలిపింది.



గడిచిన కాలంలో యువభేరి, దీక్షలు తో తాము కూడా కార్యక్రమాలు చేపట్టమని,  ప్రత్యేక హోదా కోసం పోరాడామని వైసిపి నేతలు అయినా మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాస్ గుర్తుచేసారు. తాజా గా సినిమా పరిశ్రమలో ప్రత్యేక హోదా గురించి ఎప్పుడూ మాట్లాడే  శివాజీ తప్ప ఇప్పటిదాకా ఎవరు స్పందించలేదు. అయితే తొలిసారిగా దర్శక నిర్మాత అయినా తమ్మారెడ్డి భరద్వాజ మద్దతు పలకడం ఆశ్చర్యం. తెలుగు సినిమా పరిశ్రమ గురించి తన వంతుగా మద్దతు ప్రకటిస్తున్నానని ఆయన ఆదివారం తెలిపారు.




దీంతో తెలుగు సినిమా రంగం మొత్తం ప్రత్యెక హోదా సాధన దిశగా బయలుదేరుతున్నట్టు రధం అవుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి  ఉద్యమిస్తున్న అఖిలపక్షంతో సిపిఐ కూడా ప్రధాన భూమికను పోషిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మోసం చేసిన  కేంద్రానికి  లొంగిపోయాడని అఖిలపక్షం సభ్యులు విమర్శించారు. గవర్నర్ కి  వినతి పత్రం ఇవ్వడం కూడా నేరంగా పరిగణించడం, అరెస్ట్ చేయడం దురదృష్టకరం అన్నారు .



ఎంత మందిని అరెస్ట్ చేసినా, నాయ‌కుల్ని నిర్భంధించినా చ‌లో అసెంబ్లీ నిర్వ‌హించి తీరుతామ‌ని వీరు స్ప‌ష్టం చేస్తున్నారు. ప్ర‌భుత్వం గాని, మంత్రులు గాని, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత‌లు గాని ఈ కార్య‌క్ర‌మానికి అన‌వ‌స‌ర‌మైన ప్ర‌చారం క‌ల్పించ‌డం ఇష్టం లేన‌ట్టు దీనిపై ఏ మాత్రం స్పందించడం లేదు. అయితే అఖిలపక్షం సభ్యులు జనసేన నాయకుడు అయినా పవన్ కళ్యాణ్ తమకు మద్దతు కోరినప్పటికీ ఆయన నుండి ఎటువంటి జవాబు లేదు. ఈ నేపథ్యంలో సమితి సభ్యులు నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమం ఎలా జరుగుతుందో అని ఎదురు చూస్తున్నారు అందరు.


మరింత సమాచారం తెలుసుకోండి: