ఎన్టీఆర్ బయోపిక్ పై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ వరకూ ఆసక్తి నెలకొంది. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ తనదైన శైలిలో శాసించిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీయడం ఆషామాషీ విషయం కాదు. ఇంతటి పెద్ద బాధ్యతను మోయడం తలకు మించిన భారమే.! అందుకేనేమో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు తేజ.

Image result for ntr biopic

     సినీ పరిశ్రమలో జరుగుతున్న తాజా పరిణామాలు షాక్ కి గురి చేస్తున్నాయి. ఇన్నాళ్లూ కాస్టింగ్ కౌచ్ వివాదం నడిచింది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ తెరపైకి వచ్చింది. ఇటీవలే ముహూర్తం షాట్ కొట్టిన ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్టీఆర్ బయో పిక్ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ పాత్ర విషయంలో బాలకృష్ణ, తేజల మధ్య విభేదాలు తలెత్తడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Image result for ntr biopic

అయితే.. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి సినిమాను ఆ స్థాయిలో తెరకెక్కించలేనేమోనని భావించే తాను తప్పుకుంటున్నట్టు తేజ ప్రకటించారు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే అవకాశమున్నట్టు చెప్పాడు. మరోవైపు గౌతమిపుత్ర శాతకర్ణితో బాలకృష్ణను మరో మెట్టు పైకి ఎక్కించిన క్రిష్ పేరు కూడా వినిపిస్తోంది. బాలకృష్ణే ఈ సినిమా తీస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి వీరిలో ఎవరు డైరక్టర్ గా వ్యవహరిస్తారనేది త్వరలోనే తేలనుంది.

Image result for ntr biopic

భారీ తారగణంతో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోంది. అంతేకాక రెండు భాగాలుగా సినిమా తీయాలనే యోచనలో బాలకృష్ణ ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తేజ తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: