స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  నిర్మాత కొడుకు కావడంతో మొదటి నుంచి ఈ హీరో సినిమాలు చాలా రిచ్ గానే తీస్తున్నారు. స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్లతో సినిమాలు తీస్తున్నా హిట్ మాత్రం ఒక్కటీ పడటం లేదు.  హిట్..ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో. 


తాజాగా కవచం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ హీరో.. సీత మూవీతో త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.  ప్రస్తుతం తమిళంలో హిట్ అయిన రాక్షసన్ సినిమా రిమేక్ గా వస్తున్న ‘రాక్షసుడు’ సినిమాలో నటిస్తున్నాడు.  ఉగాది పండుగ పురస్కరించుకొని చిత్రబృందం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో బెల్లంకొండ, అనుపమ సీరియస్ లుక్ తో కనిపిస్తున్నారు.  


ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.. సైకో కిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరణ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రైడ్‌, వీర ఫేమ్‌ రమేష్‌ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది ఈద్ సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: