సాధారణంగా ఒక హీరో రిజెక్ట్ చేసిన ఒక కథ వేరే హీరోతో తీసినప్పుడు ఆ మూవీలు సూపర్ హిట్ అయిన సందర్భాలు చాల ఉన్నాయి. ముఖ్యంగా రవితేజా వదులుకున్న ‘పోకిరి’ కథ మహేష్ కు అదృష్టంగా మారడం పవన్ కళ్యాణ్ తిరస్కరించిన ‘ఇడియట్’ మూవీ కథ రవితేజాకు కలిసిరావడం ఇలా అనేక సందర్భాలు ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ గా ఉన్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో ఈనెల విడుదల కాబోతున్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ అలాంటి రిజెక్షన్ సెంటిమెంట్ తో రామ్ కు ఘన విజయం ఇస్తుందా అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ కథను పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకుని వ్రాసింది అన్న ప్రచారం జరుగుతోంది. 

అయితే విజయ్ దేవరకొండ ఈమూవీ కథ తనకు నచ్చింది అని చెప్పి ఎప్పటికీ పూరీకి డేట్స్ ఇవ్వకపోవడంతో పూరీ ఈకథను రామ్ కు చెప్పడం ప్రస్తుతం ఫెయిల్యూర్ ల మధ్య సతమతమైపోతున్న రామ్ ఈకథకు వెంటనే ఒకే చెప్పడం జరిగిపోయింది అని అంటున్నారు. ప్రస్తుతం రామ్ తో పాటు పూరీకి కూడ ఈమూవీ విజయం వారి కెరియర్ కు అత్యంత కీలకంగా మారడంతో ఈ రిజెక్షన్ సెంటిమెంట్ అదృష్టంగా మారుతుంది అన్న ఊహలలో రామ్ పూరీలు కొనసాగుతున్నట్లు టాక్.   

ఈనెల 18న విడుదల కాబోతున్న ఈమూవీ ట్రైలర్ ను త్వరలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రెడీ పెట్టిన ఈ ట్రైలర్ ను చూసిన కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు ఈ ట్రైలర్ చాల బాగుందని కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో కాస్త బూతులు ఎక్కువగా ఉన్నా అయితే అవి సినిమా చూసే వారికి చాలా పద్దతిగా అనిపిస్తూ ఎక్కడా అశ్లీలత కనిపించదు అని టాక్. దీనితో ఈమూవీ విజయం సాధించడం ఖాయం అని ఈమూవీ ద్వారా టేకింగ్ విషయంలో ఒకప్పటి పూరి జగన్నాథ్ ను మళ్ళీ చూడబోతున్నాము అంటూ ప్రచారం జరుగుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: