ఈవారం విడుదల కాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు అందరూ ఊహించినట్లుగానే సెన్సార్ ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది. పూరి కూడ ఈవిషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా ఈమూవీ ప్రమోషన్ గురించి దృష్టి పెట్టాడు. ఈ నేపధ్యంలో పూరి జగన్నాథ్ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు. 

పూరీ ‘ఒక మత్తు మందుతో సమానం’ అంటూ హీరో రామ్ చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ పూరీ తనదైన రీతిలో క్లారిటీ ఇచ్చాడు. తన సినిమాలలో నటించే ఏ హీరోకి అయినా ఎటువంటి టెన్షన్ లేకుండా అతడిని రిలాక్స్ గా ఉండేడట్లు చూస్తానని అందువల్లనే చాలామంది హీరోలు తనతో మళ్ళీమళ్ళీ సినిమాలు చేయడానికి ఇష్టపడతారు అంటూ కామెంట్స్ చేసాడు. 

బహుశా ఆ అభిప్రాయం వల్లనే తనను మత్తు మందుతో పోల్చి ఉంటాడు అంటూ జోక్ చేసాడు. ఇదే సందర్భంలో ఈసినిమాలోని కథ ఒక హాలీవుడ్ సినిమా కథకు ప్రేరణ అన్న అంశం పై స్పందిస్తూ ప్రస్తుతం తెలుగులో వస్తున్న చాల సినిమాలు హాలీవుడ్ సినిమాల ప్రేరణతో తీసినవి కావా అంటూ సెటైర్ వేసాడు. 

ప్రస్తుతం ఒక మనిషి రాణించాలి అంటే సక్సస్ కావాలని ఏ రంగంలో అయినా ఒక మనిషి విజయాలు సాదిస్తే జనం వెధవను కూడ జీనియస్ లా ఆరాదిస్తున్నారు అంటూ విజయం లేకుంటే ఎవరు ఎవర్ని గుర్తించరు అంటూ పూరీ తన సహజ సిద్ధమైన వాస్తవిక దృష్టితో కామెంట్స్ చేసాడు. గత కొద్ది నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలై భారీ విజయాలు అందుకున్న ‘జెర్సీ’ ‘మజిలీ’ ‘ఓ బేబి’ ‘బ్రోచేవారు ఎవరురా’ ‘ఎ జెంట్ సాయి శ్రీనివాసు ఆత్రేయ’ లాంటి సినిమాలు అన్నీ డిఫరెంట్ కథలతో కూడుకున్న నేపధ్యంలో ప్రేక్షకులు మాస్ మసాలా సినిమా తీసి చాల రోజులు అయిందని అందువల్లనే తన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అవుతుంది అంటూ భారీ అంచనాలతో పూరీ జగన్నాథ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు..   మరింత సమాచారం తెలుసుకోండి: