బద్రినాధ్ సినిమా తర్వత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం జులాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రన్ని నిర్మిస్తునాడు. ఈ మువీకి సంబంధించిన చివరి పాట చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. డాన్స్ మాస్టర్ శెఖర్ నేతృత్వంలో అల్లు అర్జున్ పై జులాయి టైటిల్ సాంగ్ ని షుట్ చేస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని జులైమొదటి వారంలో విడుదల చెయ్యాలని ముందు ప్లాన్ చేవారు. కానీ కొన్ని కారణాల వల్ల జులై చివరి వారంలో విడుదల చేయాలనుకుంటున్నారన్ని సినీ వర్గలు చెబుతునాయి. ఈ మువీలో ఇలీయానా హీరోగా నటిస్తోంది. ఈ సినిమాపై అల్లు అర్జున్, ఇలీయానా,త్రివిక్రమ్ శ్రీనివాస్ బారి అంచనాలే పెట్టుకున్నారట. ఎందుకంటే ఈ ముగ్గురికీ ప్రీవయస్ మువీస్ ఏవీ పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. మరి ఈ జులాయి అయినా ఈ ముగ్గురికి సక్సెస్ ని అందిస్తుందో చూడాలిమరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి