అల్లు అర్జున్ కెరియర్ లో భయంకరమైన ఫ్లాప్ ల లిస్టు వేసుకుంటే ఆలిస్టులో ముందు వరసలో గత సంవత్సరం విడుదలైన ‘నా పేరు సూర్య’ ఉంటుంది. ఈ మూవీ దెబ్బకు భయపడిపోయిన బన్నీ ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడ విడుదల చేయకుండా ఖాళీగా ఈ సంవత్సరాన్ని పూర్తి చేస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ తో పోటీ పడుతూ సంక్రాంతి రేసుకు వస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలోని మహేష్ పాత్ర ‘నాపేరు సూర్య’ సినిమాలోని అల్లు అర్జున్ పాత్ర ఛాయలో కనిపిస్తుందని కొన్ని లీకులు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారంమేరకు ‘సరిలేరు నీకెవ్వరు' లో మహేష్ పాత్రకు విపరీతమైన కోపంతో ఉంటుందట. అన్యాయం అక్రమం అనే పదాలు వినిపిస్తే మహేష్ లోపల ఉగ్రరూపం బయటపడుతుండట. దీనితో మహేష్ కోపం భరించలేక మహేష్ ను బోర్డర్ కు పంపేస్తారట.  అక్కడ శత్రువులను  ఇరగదీసి ఆతర్వాత తన సొంతఊరు వచ్చినప్పుడు అక్కడ జరిగే అన్యాయాలను ఎదురించి విలన్స్ భారతం పట్టే పని మొదలుపెడతాడట.  

ఈ సందర్భంలో మహేష్ విపరీతమైన ఆవేశానికి లోనవుతూ ఒకవైపు శత్రుదేశాల నుంచి భారతదేశ ప్రజలను రక్షిస్తూ సరిహద్దులో ప్రాణాలకు తెగించి ఆర్మీ పోరాడుతూ ఉంటే ఇక్కడ రకరకాల కారణాలతో అందరు కొట్టుకుని చస్తూ ఉంటే సైనికులు చేసిన త్యాగాలకు అర్ధం ఏమిటి అంటూ మహేష్ ఆవేశపూరితంగా చెప్పే డైలాగ్ ఈమూవీకి హైలెట్ అని అంటున్నారు. మహేష్ ను ఇలా యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలో చూడటం అభిమానులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడ ఇదే మొదటిసారి. దీనితో ఈకొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నవిషయాన్ని బట్టి ఈమూవీ సక్సస్ ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: