ఆయన పేరులోనే ఉంది విక్టరీ... ఇక ఆయన ఖాతాలో మరెన్నో విక్టరీలు . ఆయనే టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్. ఫ్యామిలీ కథ సినిమాల  హీరోగా వెంకటేష్ కు మంచి పేరు ఉంది. కుటుంబ కథా చిత్రాల్లో  వెంకటేష్ ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటాడు. కుటుంబ కథ సెంటిమెంట్ ను  వెంకటేష్ పండించినంతగా  మరే హీరో పండించలేడేమో  అనేంతగా వెంకటేష్ నటన ఆకట్టుకుంటుంది. సీనియర్ హీరో అయినప్పటికీ జూనియర్ హీరోలకు సైతం పోటీని ఇస్తుంటాడు వెంకటేష్. ఇక గత విభిన్న కథలు ఎంచుకుంటూ మంచి విజయాలను  ఖాతాలో వేసుకున్నాడు.

 


ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్  సోలోగా సినిమాలు చేయాలని అనుకోవడం కంటే ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచిన ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా మేనల్లుడు నాగచైతన్య  కు  రీల్ లైఫ్లో కూడా మామ గా నటిస్తూ వెంకీ మామ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వెంకటేష్. నాగచైతన్య వెంకటేష్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం వెంకీ మామ విడుదలకు సిద్దంగా ఉంది . ఇక వెంకటేష్ సోలో సినిమాలు చేసి కూడా చాలా కాలమైంది. దీంతో మల్టీస్టారర్ సినిమాలపై దృష్టి పెట్టిన వెంకటేష్... వెంకీ మామ తర్వాత హీరో అసురన్  రీమేక్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. 

 


 సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబడుతుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసురన్  తర్వాత  మరో ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే దర్శకుడు ఆకుల శివ వినిపించినా కథ సురేష్ బాబు బాగా నచ్చిందట. అయితే దర్శకుడు ఆకుల శివ వినిపించిన కథ మల్టీస్టారర్ కాగా ఈ సినిమాలో వెంకటేష్ నాని పేర్లు కథానాయకులుగా అనుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ తో  మరొక హీరోగా నాని అయితేనే బాగుంటుందని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నాడట. గతంలో నాని కూడా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తో కలిసి దేవదాసు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: