హీరోయిన్ సమంత ,నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకోక, కొన్నేళ్ళకు విడాకులు తీసుకున్నారు. అనంతరం కొంతకాలం సింగిల్ గా లైఫ్ ని గడిపిన సమంత ,ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన రాజ్ నిడిమోరు అనే బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమలో పడి ఇటీవలే ఒక గుడిలో వివాహం చేసుకుంది. ముఖ్యంగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది.


గతంలో అక్కినేని హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత ఆ వెంటనే అక్కినేని సమంతగా తన పేరును మార్చుకుంది. సమంత రెండో వివాహము అనంతరం తన పేరుని ఇంకా సమంత ఎందుకు మార్చుకోలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా టైటిల్స్ లో సమంత పేరు సమంత నిడిమోరు అని పడుతుందట. ఈ సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కూడా తన పేరును మార్చుకోబోతుందని ఇది అభిమానులకు ఒక స్వీట్ సర్ప్రైజ్ లాగా ఉండబోతుందని వినిపిస్తోంది.



హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం తర్వాత భార్య ఇంటి పేరు మారుతుంది.. భర్త ఇంటి పేరు భార్య పెట్టుకోవడం జరుగుతుంది. సమంత క్రిస్టియన్ మతస్తురాలు అయినప్పటికీ కూడా ఎక్కువగా హిందూ దేవుళ్లను నమ్ముతుంది. కనుక ఈ సెంటిమెంట్ ని ఎక్కువగా ఫాలో అవుతోంది సమంత. సమంత హీరోయిన్గా వెండితెర పైన కనిపించి ఇప్పటికీ చాలా రోజులు అవుతోంది. చివరిగా విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మించిన శుభమ్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించి ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: