టాలీవుడ్ బాలీవుడ్ లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది జాన్వీ కపూర్. మొదట బాలీవుడ్లో ధడక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలోకి ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలో నటించి భారీ క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి జాన్వీ కపూర్ ఇటీవల ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలో నటించిన హోమ్ బౌండ్ చిత్రంలో నటించింది. ఇద్దరు నిరుపేద ఉత్తర భారతీయుల స్నేహం కథ ఆధారంగా తెరకెక్కించారు. డైరెక్టర్ నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


ప్రస్తుతం జాన్వీ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కూడా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించగా 2026  మార్చి 27 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో తన ఫోకస్ మొత్తం సౌత్ ఇండస్ట్రీ పైన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే జాన్వీ బాలీవుడ్ లో బడ నిర్మాతకు ఒక పెద్ద షాక్ ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. తాజాగా ఈమె తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.


జాన్వీ ని హీరోయిన్గా పరిచయం చేసిన బడ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కు షాక్ ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. ధర్మ ప్రొడక్షన్ నుంచి ఈమె బయటికి వచ్చినట్లు వినిపిస్తున్నాయి. అలా బయటికి వచ్చి కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అనే ఒక కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని రోజులపాటు జాన్వీ ఏ సినిమా చేయాలి ఎలాంటి బ్రాండ్ కు ప్రచారం చేయాలనే విషయంపై ఎక్కువగా కరణ్ జోహార్ నిర్ణయించే వారు. దీంతో జాన్వీ పై ఎక్కువగా నెపోకిడ్ అనే ముద్రతో విమర్శలు వినిపించడంతో జాన్వీ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు బిటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజమో ఉందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: