ఇప్పటికే విశ్వంభర చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ పై విఎఫ్ఎక్స్ బాగా లేదంటూ ట్రోల్స్ కూడా వినిపించాయి. దీంతో ఈ సినిమాని రీషూట్ చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. గత సంవత్సరమే ఈ సినిమా విడుదల కావలసి ఉండగా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే తాజాగా చిరంజీవి విశ్వంభర సినిమా విడుదల పైన క్లారిటీ ఇచ్చారు.
చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ విశ్వంభర సినిమా 2026 జులై 9వ తేదీన వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి సీజీ ఇంకా జరుగుతున్నాయని తాను చూడలేదని, అలాగే డైరెక్టర్ బాబీతో చేయబోయే సినిమా కూడా మాస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని, ఆ సినిమా కూడా డైరెక్టర్ బాబి స్టైల్ లోనే తీయబోతున్నారంటు తెలిపారు. దీంతో విశ్వంభర సినిమా ఎట్టకేలకు జూలై 9వ తేదీన విడుదల కాబోతోందని చిరంజీవి చెప్పడంతో అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి