మన పూర్వీకులు చద్దన్నాన్ని అమృతంతో సమానంగా భావించేవారు. రాత్రి మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి, మరుసటి రోజు ఉదయం పెరుగు లేదా మజ్జిగతో కలిపి తీసుకోవడం కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, అదొక అద్భుతమైన ఆరోగ్య రహస్యం. రాత్రంతా అన్నం నీళ్లలో నానడం వల్ల అందులో కిణ్వ ప్రక్రియ (Fermentation) జరిగి, బియ్యంలో ఉండే పోషక విలువలు వందల రెట్లు పెరుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే 'ప్రోబయోటిక్స్' లేదా మేలు చేసే బ్యాక్టీరియా మన జీర్ణవ్యవస్థను సమూలంగా మారుస్తుంది. ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు చద్దన్నం ఒక సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది.

సాధారణ అన్నంతో పోలిస్తే చద్దన్నంలో ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు విపరీతంగా పెరుగుతాయి. ఉదాహరణకు, 100 గ్రాముల వేడి అన్నంలో 3.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే, అదే అన్నం 12 గంటల పాటు నానితే అందులోని ఐరన్ స్థాయి 73 మిల్లీగ్రాముల వరకు చేరుతుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి గొప్ప వరం. అలాగే, చద్దన్నం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే, ఒంట్లోని అధిక వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎండకాలంలో చద్దన్నం తినడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది.

చర్మం కాంతివంతంగా మెరవడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన బి6, బి12 విటమిన్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచడంలోనూ, ఎముకలను దృఢంగా మార్చడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రోజును చద్దన్నంతో ప్రారంభించడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. అందుకే ఈ 'సూపర్ ఫుడ్'ను నిర్లక్ష్యం చేయకుండా మన ఆహార అలవాట్లలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం. చద్దన్నం అలవాటు చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ లో ఎన్నో బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం  అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: