తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను జనవరి 11 వ తేదీన రాత్రి నుండి అనేక ప్రాంతాలను ప్రదర్శించారు. ఈ మూవీ కి అద్భుతమైన పాజిటివ్ టాక్ ప్రీమియర్ షో ల ద్వారానే రాపాడంతో ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు నుండి అద్భుతమైన కలెక్షన్లు దక్కుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన చాలా రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది.

అందులో భాగంగా ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన లాభాలను కూడా అందుకుంది. ఇకపోతే విడుదల అయిన 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ చాలా కింది స్థాయిలో నిలిచింది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన బ్లాక్ బాస్టర్ సినిమా 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన షేర్ కలెక్షన్లను దాటలేకపోయింది. వరుణ్ తేజ్ కొన్ని సంవత్సరాల క్రితం ఫిదా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 1.14 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కి విడుదల అయిన 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.11 కోట్ల షేర్ కలక్షన్లు దక్కాయి. ఇలా విడుదల అయిన 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఫిదా మూవీ తో పోలిస్తే మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కాస్త వెనుకబడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: