500పైగా చిత్రాల్లో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో   సుఖీభవ మూవీస్ పతాకంపై ‘లవర్స్ డే’ ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మించిన  చిత్రం “ఊల్లాల ఊల్లాల”. సత్యప్రకాష్ తనయుడు నటరాజ్ ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నూరిన్‌, అంకిత‌ కథానాయికలు.ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు. 


ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. ''సినిమాకు సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ చాలా బావున్నాయి. మేకింగ్‌ వీడియోలో సత్యప్రకాష్‌ను చూసి ఆశ్చర్యపోయా. తనలో ఇంత టాలెంట్‌ వుందా అనిపించింది. ఇక నాయికగా నటించిన అంకిత బాగా డాన్స్‌ చేసింది. ఈ చిత్ర నిర్మాత గురురాజ్‌కు సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నా . హీరో నటరాజ్ కి ,అలాగే చిత్ర యూనిట్ కి నా బెస్ట్ విషెస్ అందిస్తున్నాను''అని తెలిపారు.

 

నిర్మాత గురురాజ్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కొసం వందలాది మంది పని చేశారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మాది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జనవరి 1 న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము  '' అన్నారు  

 

చిత్ర దర్శకుడు సత్యప్రకాష్‌ మాట్లాడుతూ.. ''జనవరి 1న సినిమా విడుదల చేస్తున్నాం. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నా. ఈ సినిమాను నిర్మించి విడుదలకు తీసుకు వచ్చిన గురురాజ్‌కు ధన్యవాదాలు. ఆయనతో జర్నీ చాలా ఆనందంగా వుంది. ప్రతి సన్నివేశాన్ని ఇద్దరం చర్చించుకుని తెరకెక్కించాం. అదేవిధంగా సినిమాకు ఏ టైటిల్‌ పెడదామని చర్చించుకుంటుండగా సడన్‌గా ఆయన మదిలో మెదిలిన ఆలోచనతో టైటిల్‌ దొరికిందంటూ.. 'ఊల్లాల..ఊల్లాల' అని పాడుకుంటూ వచ్చారు. ఈ టైటిల్‌ చిత్ర యూనిట్‌కూ నచ్చింది. వర్మగారు కూడా బాగుందన్నారు. వర్మగారు రావడానికి గురురాజ్‌, రామకృష్ణ గౌడ్‌లే కారణం'' అన్నారు.

 

  సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ''రెగ్యులర్‌ ప్రొఫెషన్‌ నుంచి రూటుమారి దర్శకుడు అయ్యాడు సత్యప్రకాష్‌. కొత్తవారితో తీయడమంటే కొన్ని ఆర్థిక సమస్యలుంటాయి. కానీ గురురాజ్‌ సినిమాకు విడుదలచేస్తాడనే భరోసానే సత్యప్రకాష్‌ను నడిపించింది. ఇక రాము రావడం ఈ చిత్రానికి ఎనర్జీ. ఈ సినిమా గురించి ట్వీట్‌ చేయాలి'' అని వర్మను కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: