నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా రెండు రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచే కాకుండా బాలయ్య అభిమానుల నుంచి కూడా సరైన రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. యావరేజ్ కంటెంట్ అయినా బాగుండేదని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలయ్య యాక్షన్ కు, డైలాగ్ డెలివరీకి తిరుగులేకపోయినా ప్రేక్షకులను మెప్పించే అంశాలు కూడా ఉంటే బాగుండేదని అంటున్నారు. సినిమా టాక్ ఏమాత్రం తేడాగా వచ్చినా నేటి రోజుల్లో సినిమా రన్ కష్టమైపోతున్న రోజుల్లో ఆడియన్స్ ను మెప్పించాల్సిందే.

 

 

అసలు తమిళ దర్శకుడు కేఎస్ రవి కుమార్ ను ఎంచుకోవడమే బాలయ్య అభిమానులు ఆలోచించారు. ఎందుకంటే.. వీరి కాంబోలో గతేడాది వచ్చిన జై సింహ సినిమా కథగా బాగున్నా లాంగ్ రన్ భారీ సెంటిమెంట్ కొంత ప్రభావం చూపింది. అప్పటికీ కొంతమేర ఆడినా ఆశించిన హిట్ కాలేకపోయింది. దీనికి తోడు.. భారీ అంచనాలతో వచ్చిన పవన్ - త్రివిక్రమ్ ఆజ్ఞతవాసి దారుణ ప్లాప్ కావడం ఈ సినిమా రన్ కు ఉపయోగపడింది. దీంతో జై సింహకు కొద్దిగా కలిసొచ్చిందనే చెప్పాలి. దీంతో.. తమ కాంబో వర్కౌట్ అయిందని భవించారో ఏమో.. రూలర్ లాంటి సినిమా చేసారా అనే కామెంట్లూ వస్తున్నాయి. కేఎస్ రవికుమార్ కు తమిళ్ లోనే సినిమాలు లేని పరిస్థితి. అటువంటప్పుడు బాలయ్య ఇతనిపై ఎలా మొగ్గు చూపాడో అని కూడా అంటున్నారు.

 

 

బాలయ్య కూడా తాను ప్రస్తుత సినిమా పోకడను పట్టించుకోనని అంటుంటాడు. యూత్ తెచ్చే కలెక్షన్ల మీదే ఆధారపడిన నేటి కలెక్షన్లు.. వారిని మెప్పించే అంశాలు తప్పకుండా ఉండాల్సిందే. హీరోయిన్ అందాల ఆరబోత ఉంటే సరిపోతుందా.. అంటే చాలదనే చెప్పాలి. మొత్తానికి సి.కల్యాణ్ నిర్మాతగా బాలయ్యతో చేసిన మూడు సినిమాలు లాభాలు తేలేదనే చెప్పాలి. దీంతో బాలయ్య ఈ ఏడాది ప్లాప్ తో మొదలెట్టి ఫ్లాప్ తో ముగించాడనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: