టాలీవుడ్ లో ఏం మాయ చేసావే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాల భామ సమంత. ఈ మూవీలో తన సహనటుడు అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పెళ్లి తర్వాత సమంత నటించదని కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. ట్విస్ట్ ఏంటంటే వివాహం తర్వాతనే సమంతకు వరుసగా విజయాలు కలిసి వస్తున్నాయి. రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్, ఓ బేబీ వరుస హిట్స్ గా నిలిచాయి. ఆ మద్య సమంత- నాగ చైతన్య వివాహం తర్వాత నటించిన మూవీ ‘మజిలీ’ మంచి విజయం అందుకుంది. ఇక పెళ్లైన తర్వాత గ్లామర్ తరహా పాత్రలో నటించకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తుంది సమంత. అంతే కాదు ఇటీవల ఓ బేబీ లాంటి ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది.
సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటోంది. గత ఏడాది తమిళంలో సూపర్ డీలక్స్, తెలుగులో మజిలీ, ఓ బేబీ అంటూ కొత్త తరహా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని అందించడమే కాకుండా సామ్‌కి ప్రశంసల్ని అందించాయి. ఇదిలా ఉంటే అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలు మాత్ర పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని సంతోషపరుస్తుంది. తన నాటీ నటీ ఫొటోలతో ఇన్ స్టాని గిలిగింతలు పెట్టేస్తుంటుంది.
తాజాగా అలాంటి కొన్ని ఫొటోలని సమంత సోషల్ మీడియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. లైట్ రోజ్ కలర్ సారీలో సామ్ సామ్ కనిపిస్తున్న ఫొటోలు ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు సారీలో సమంత మునుపటి కన్నా అందంగా జిగేల్ మంటూ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. సామ్ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ ఫొటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి.ఇందులోని ఓ ఫొటోలో సామ్ పెట్టిన పోజు, ఆమె నడముకున్నటాటూకి అర్థమేంటని అంతా సరదాగా కామెంట్ చేస్తున్నారు.