పవన్ కల్యాణ్  నిన్న ‘పింక్’ రీమేక్ షూటింగ్ కు వచ్చినా దినదిన గండంగా మారింది అని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకే షూటింగ్ స్పాట్ కి  వచ్చి పవన్ ఆ తరువాత మధ్యాహ్నం తిరిగి మంగళగిరిలో ఉన్న తన పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయి రాజకీయ వ్యహారాలు నడిపించి అదేరోజు అర్థరాత్రికి హైదరాబాద్ వస్తానని పవన్  ఇప్పటికే దిల్ రాజ్ కి చెప్పినట్లు సమాచారం. 

ఇలా 3 నెలలు చేస్తానని పవన్ చెపుతున్న నేపధ్యంలో ఇంత ఒత్తిడి పవన్ ముఖంలో కనిపించి పవన్ ముఖంలో ఫ్రెష్ నెస్ కనిపించకపోతే తమ పరిస్థితి ఏమిటి అంటూ దిల్ రాజ్ వేణు శ్రీరామ్ లు తల పట్టుకున్తున్నట్లు టాక్. నిన్న అర్థరాత్రి వరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో హడావిడి చేసిన పవన్ ఈ రోజు ద్వీతీయ విఘ్నం ఎర్పడకూడదు అంటూ రాత్రికి రాత్రే విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకొని దిల్ రాజ్ కు తాను ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ షూటింగ్ స్పాట్ కు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

వాస్తవ్వానికి పవన్ కు  మూడ్ వచ్చే వరకు షాట్లో నటించడు అన్న ప్రచారం ఉంది. దీనికితోడు ఈ అర్ధరాత్రి ప్రయాణాల అలసట పవన్ తట్టుకోగలుగుతాడా అని దిల్ రాజ్ మదన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు పవన్ మూవీ షూటింగ్ ఒక చోట పవన్ రాజకీయ వ్యహారాలు నడుపుతున్న చోటు మరోకచోటు ఉండటంతో ఈ రెండిటి మధ్య ఎలా సమన్వయం కుదర్చాలో తెలియక దిల్ రాజ్ పూర్తి కన్ఫ్యూజ్ అవుతున్నట్లు సమాచారం. 

దీనికితోడు ప్రస్తుతం పవన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యవహారాలూ ఆన్ని బీజేపీతో కలిసి నడిచేవిగా ఉండటంతో అనుకోని వ్యూహాలతో బిజేపి ముందుకు వస్తే పవన్ ప్లాన్స్ కూడ మారిపోయే అస్కారం ఉంది. దీనితో ‘పింక్’ రీమేక్ కు సంబంధించిన మిగతా ఆర్టిస్టుల డేట్స్ తో తేడా వచ్చి ఈ మూవీని అనుకున్న విధంగా వేగంగా పూర్తిచేయడం కష్టం అన్న సంకేతాలు ఇప్పటికే దిల్ రాజ్ కు వచ్చినా ధైర్యంగా పవన్ ముందు చెప్పలేని పరిస్థితి అంటూ దిల్ రాజ్ పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: