కోలీవుడ్ డబ్బింగ్ సినిమా దర్బార్ తో ఈ సంక్రాంతి సందడి మొదలైంది. మురుగదాస్, రజినీకాంత్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దర్శకుడిగా తన శైలికి బిన్నంగా మురుగదాస్ చేసిన ఈ మాస్ ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టింది. 

 

దర్శకుడు మురుగదాస్ దర్బార్ సినిమాను రజినీకాంత్ వన్ మెన్ షోగా తీర్చిదిద్దాడు. పోకిరీ పోలీస్ గా రజినీకాంత్ తనదైన స్టైల్ తో ఫస్ట్ హాఫ్ ను నిలబెట్టాడు. కానీ సెకండాఫ్ లో కూడా రజినీ మేనరిజం, స్టార్ డమ్ నే నమ్ముకున్న మురుగాస్ కథను వదిలేశాడు. ఇదే దర్బార్ సినిమా రిజల్ట్ కు దెబ్బేసింది. 

 

చాలా ఏళ్ల తర్వాత రజినీ కాంత్ దర్బార్ సినిమాలో పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్ దుమ్ముదులిపాడు. కానీ క్యారెక్టర్ కు సరిపడ కంటెంట్ లేకపోవడంతో రజినీకాంత్ స్టార్ డమ్ సైతం సినిమాను నిలబెట్టలేకపోయింది. నయనతార లాంటి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ ని కూడా మురగదాస్ వినియోగించకోలకపోయాడు. రజినీకాంత్ కు కూతురిగా నటించిన నివేదా థామస్ క్యారెక్టర్ నిరాశపరిచింది. 

 

వరల్డ్ వైడ్ గా 140కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన దర్బార్ ఫస్ట్ వీక్ లో 140కోట్ల గ్రాస్ తో 78కోట్ల షేర్ దక్కించుకుంది. తెలుగులో 14కోట్ల ప్రీబిజినెస్ చేసిన రజినీ సినిమా ఫస్ట్ వీక్ లో 15కోట్ల గ్రాస్ వసూళ్లతో 8కోట్ల షేర్ తెచ్చుకోగలిగింది. మరో 7కోట్లు వసూలు చేస్తే గానీ దర్బార్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ ముగిసింది. ఈ మొత్తాన్ని రాబట్టడం అసాధ్యమే అని చెప్పాలి. సంక్రాంతి బరిలో నిలిచిన దర్బార్ కు అపజయం తప్పలేదు. మొత్తానికి రజినీ కాంత్ కు అభిమానుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఆయన సినిమా అంటే చాలు ఎగేసుకొని వెళ్లిపోతున్నారు. దీంతో రజినీసినిమా చేసినా మినిమమ్ గ్యారెంటీ అయితే వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: