గ‌త ఏడాది త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘96’. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అందాల తార త్రిష జంటగా నటించిన ఈ చిత్రం క్లాసిక్ మూవీగా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రానికి తెలుగు రీమేక్‌లో శ‌ర్వానంద్‌, స‌మంత అక్కినేని హీరోహీరోయిన్లుగా `జాను` పేరుతో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెలుగు వర్షన్‌ను తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

ఇక ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల అయ్యి పాసిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ కథలో ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అదిరిపోయే యాక్షన్స్ ఎపిసోడ్స్ లాంటివి ఏం లేకుండా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా సాఫీగా సాగిపోయే కథనంతో.. కేవలం పాత్రల ద్వారా జరిగే మ్యాజిక్‌తో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టేసింది ఈ సినిమా. అలాగే చైల్డ్ హుడ్ జానుగా గౌరీ గీత కిషన్ చేస్తే, యంగ్ జానుగా సమంత చేసింది. స్కూల్ ఎపిసోడ్స్ లో ఒరిజినల్ వెర్షన్ లానే తెలుగులో కూడా గౌరీ సూపర్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కథని ఆడియన్స్ కి కనెక్ట్ చేసింది. శర్వానంద్ కూడా రామ్ పాత్రని చాలా బాగా చేసాడు. 

 

సెటిల్ పెర్ఫార్మన్స్ తో, డైలాగ్స్ తక్కువైనప్పటికీ హావా భావాలతో ఆకట్టుకున్నాడు. అలాగే ప్రేమకథల్ని ఇష్టపడేవాళ్లకు.. ఫీలయ్యే వాళ్లకు జాను ఒక మంచి జ్ఞాపకంగా నిలుస్తుంది. జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమ భావనలు పొందిన ప్రతి ఒక్కరూ ఈ కథతో ప్రేమలో పడతారు. తమిళంలో మాదిరే స్కూల్ లవ్ స్టోరీ 90ల్లో నడిచినట్లు చూపిస్తే బాగుండేది. ఈ విషయంలో కొంత స్పష్టత కొరవడి.. కొన్ని చోట్ల లాజిక్ మిస్సయిన ఫీలింగ్ కలగుతుంది. ఓవ‌రాల్‌గా జీవితంలో ఒక్క‌సారి అయినా ల‌వ్‌లో ప‌డే వాళ్లు త‌ప్ప‌కుండా ఈ సినిమా చూడాలి.. ఎందుకంటే ఆ అనుభూతే వేరు..!

మరింత సమాచారం తెలుసుకోండి: