నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకుంటాను.. అని ఎవరికి నచ్చితే ఏంటి ఎవరికి నచ్చకపోతే అంటూ.. ఎబ్బెట్టుగా ఉందన్న నెటిజన్ల విమర్శలను బాలీవుడ్ హాట్ బ్యూటీ నుష్రత్ కొట్టి పారేసింది. అభిప్రాయాన్ని చెప్పేందుకు వారికి ఎలా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందో.. అలాగే నాకు నచ్చిన డ్రెస్ వేసుకునే హక్కు తనకు ఉందని ఆమె వ్యాఖ్యానించింది. 

 

తరచూ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు షేర్ చేస్తూ బోలెడంత ఫేమ్ సాధించింది ఈ భామ. తన డ్రెస్ విషయంలో ఇతరుల కామెంట్స్‌ ను తాను పట్టించుకోనని వ్యాఖ్యానించింది. తనకు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తే మరోసారి వేసుకోనని పేర్కొంది.

 

ఇక నేరుగా విషయానికొస్తే ఇటీవల ఓ ఈవెంట్‌ లో నుష్రత్ వేసుకున్న డ్రెస్ ఫోటోలు సెగలు పుట్టించాయి. నడుము పై వరకు స్కిన్ షో చేస్తున్న ఈ బోల్డ్ ఫోటోలను స్వయంగా ఆమె  సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్ చాలా ఎబ్బెట్టుగా ఉందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. దీనిపై ధీటుగా సమాధానమిచ్చిన నుష్రత్.. తన డ్రెస్‌పై ఇతరుల అభిప్రాయాలను తాను లెక్కచేయబోనని వ్యాఖ్యానించింది. 

 

కాగా., ఈ బాలీవుడ్ బ్యూటీ 2010 లో వచ్చిన ‘తాజ్ మహల్’ చిత్రంతో శివాజీ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అలాగే బాలీవుడ్‌ లో 'లవ్ సెక్స్ ఔర్ ధోకా'.. 'ప్యార్ కా పంచనామా', 'సోనూ కే టిటూ కే స్వీటీ' తదితర సినిమాల్లో నటించింది. మీటూ ఉద్యమ నేపథ్యంలో దర్శకుడు లవ్ రంజన్‌ తనను వేధించాడని ఓ మహిళ ఆరోపించగా.. లవ్ రంజన్ సార్ చాలా మంచోడంటూ క్లీన్ చిట్ ఇచ్చేసింది ఈ అమ్మడు. ఓ అభిమాని సెల్ఫీ కోసం అని దగ్గరకు వచ్చి తన నడుము మీద చేయివేసాడని మండిపడి మొన్న ఆ మధ్య వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: