మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వచ్చి జీ తెలుగులో అదిరిందిలో జాయిన్ అయ్యాడు. జబర్దస్త్ నుండి ఆర్పి, చమ్మక్ చంద్రతో పాటుగా ఇదివరకు జబర్దస్త్ లో చేసిన వేణు, ధన్ రాజ్ లు ఈ షోలో పాల్గొంటున్నారు. సమీరా యాంకర్ గా నాగబాబు, నవదీప్ జడ్జులుగా అదిరింది షో నడిపిస్తున్నారు. భారీ స్థాయిలో మొదలు పెట్టిన ఈ షో అనుకున్నంత రేంజ్ లో క్లిక్ అవలేదు. ముఖ్యంగా సమీరా యాంకరింగ్ మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ ఫీడ్ బ్యాక్ అదిరింది టీం దాకా వెళ్లినట్టు ఉంది. అందుకే అదిరింది నుండి సమీరాని తొలగించారు.

 

సరిగా 10 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న అదిరింది షో నుండి యాంకర్ సమీరా బయటకు వచ్చింది. ఆమె ప్లేస్ లో యాంకర్ రవి, భాను శ్రీ ఇద్దరు యాంకర్స్ గా వచ్చారు. ఆల్రెడీ యాంకరింగ్ లో ఈ ఇద్దరు పి.హెచ్.డి చేశారు కాబట్టి షో ఎలా ఉండబోతుంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదిరిందిలో పటాస్ లో ప్రతిభ చాటిన సద్దాం, యాదమ్మ రాజు టీం కూడా సీనియర్స్ కు గట్టి పోటీ ఇస్తుంది. వారు చేస్తున్న స్కిట్స్ చాలా ఫ్రెష్ గా ఉంటున్నాయి. 

 

అదిరింది నుండి సమీరాని తీసేసి రవి, భాను శ్రీలను రీప్లేస్ చేయాలన్న ఆలోచన మంచిదే అని చెప్పొచ్చు. సమీరా ఇంకా యాంకరింగ్ లో పర్ఫెక్ట్ అవ్వాల్సి ఉందని అనిపించింది. అంతేకాదు ఇలాంటి షోలో కొద్దిగా గ్లామర్ షో కూడా ఉండాలి. అందుకే భానుని దించారు. రవి, భాను ఇద్దరు ఇక మీదట అదిరిందిని ఎలా తీసుకెళ్తారో చూడాలి. వచ్చే ఆదివారం ఎపిసోడ్ నుండి రవి, భాను అదిరింది యాంకర్స్ గా కనిపిస్తారు. ఈ ఎపిసోడ్ లో నాగబాబు ఆర్మీ డ్రెస్ లో అదరగొట్టారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: