హిట్ పడింది అని సంబరపడే లోపే డిజాస్టర్ ఆ బ్యూటీని మళ్లీ వెనక్కి లాగేసింది. ఆ బొద్దుగుమ్మ దురదృష్టం ఏంటోగానీ ఎన్ని సినిమాలు చేసిన ఫేట్ మారడం లేదు. కెరీర్ స్టార్ట్ చేసిన ఏళ్లు గడుస్తున్న హీరోయిన్ గా రాశీఖన్నా ఎదుగులేదు బొదుగులేదు. 

 

మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే తోనే ముద్దుగుమ్మ రాశిఖన్నా పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంది. కాస్త లావుగా తగ్గిందే స్టార్ హీరోయిన్ గా దున్నేస్తోందనే కామెంట్స్ వినిపించడంతో కష్టపడి బరువు తగ్గి నాజూకుగా తయారయింది. నాజూకుగా మారిన తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి. కానీ రాశీఖన్నా దురదృష్టం ఏంటో కానీ సక్సెస్ దక్కినా కూడా ఈ బ్యూటీ కెరీర్ ఉన్న చోటే ఉండిపోతోంది. 

 

రాశిఖన్నా కెరీర్ లో ఎదుగులేదు బొదుగు లేకుండా తయారయింది. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రావడమే గగనం అయింది. గతేడాది చివర్లో ప్రతి రోజు పండుగ చిత్రం రాశిఖన్నాకు భారీ సక్సెస్ అందించింది. ఆ తర్వాత రిలీజైన వెంకీమామ సోసోగా ఆడింది. ఇదే ఊపులో విజయ్ దేవరకొండతో జోడి కట్టిన వరల్డ్ ఫేమస్ లవర్ మరో సక్సెస్ ఇస్తోందని ఆశపడింది. కానీ ఈ సినిమా రాశీఖన్నా ఆశలపై నీళ్లు చల్లింది. 

 

ప్రస్తుతం రాశీఖన్నాకు తెలుగులో సినిమాలు లేవు. ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నా అవి ఎప్పుడు ఫైనల్ అవుతాయో తెలియని పరిస్థితి. తెలుగులో రాశీఖన్నా కెరీర్ ఎండింగ్ కు వచ్చినట్టే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  వరల్డ్ ఫేమస్ లవర్ హిట్ అయి ఉంటే ఈ బ్యూటీకి కొత్తగా ఏమైనా ఛాన్స్ లు వచ్చేయోమో. కానీ అది కాస్తా బోల్తా కొట్టడంతో అమ్మడు ఛాన్స్ ల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. మొత్తానికి వరుస ఫ్లాపులతో ఢీలా పడిపోయిన రాశీఖన్నాకు అర్జంటుగా హిట్ కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: