తెలుగు సినిమాల్లో అమ్మని ఎందుకు అంట చులకనగా చూపిస్తారు.. ఏ అమ్మ ఎందుకు ఎప్పుడు వంట ఇంటికే పరిమితం అవ్వాలి. ఆమెకు కొన్ని అర్హతలు ఉంటాయి కదా.. ఆమెను ఎందుకు ఒక బిజినెస్ మెన్ గా చూపించారు. ఆమెను ఎందుకు ఒక జాబ్ హోల్డర్ గా చూపించారు. టాలీవుడ్ లో హీరో ఫాదర్, లేదా హీరోయిన్ ఫాదర్ ఇలా వారి పాత్రలు చాలా లైట్ గా రాసుకుంటారు. కథలో అంట ప్రాముఖ్యత లేని పాత్రలు కాబట్టి వాటి గుర్తించి అంత ప్రత్యేకంగా చూపించరు. అయితే ఎందుకు తెలుగు సినిమాల్లో అమ్మ పాత్రలు కేవలం వంట గడికే అంకితమవుతున్నాయి.

 

వాళ్ళను ఎందుకు పెద్ద స్థాయిలో చూపించడానికి ఇష్టపడరు. కథలో హీరో పాత్రలు వెయిట్ ఎక్కువ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఆ ఇంప్యాక్ట్ ఇంకాస్త పెద్దదిగా ఉంటుంది. అందుకే అమ్మకి కేవలం ఒక ఐదారు సీన్స్ కు మాత్రమే పరిమితం చేస్తారు. కావాలని తల్లి పాత్రలను అలా రాసుకోవడం కాదు కథలో ఆమె పాత్ర అంతవరకే అనుకోవడం వల్లే అలా జరుగుతుంది. అయితే మహిళా ప్రాధాన్యత గురించి చెప్పే సినిమాల్లో మాత్రం కొద్దిగా తల్లి, అక్క, చెల్లి, భార్య ఇలాంటి పాత్రలకు ప్రిఫరెన్స్ ఉంటుంది. 

 

అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మహిళా ప్రాధాన్యత సినిమాలు తక్కువ అయ్యాయని చెప్పొచ్చు. కేవలం ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ అని సస్పెన్స్, హర్రర్ జానర్ మూవీస్ చేస్తున్నారు తప్ప.. మహిళా సాధికారత గురించి మాట్లాడి.. పోట్లాడే కథలు రావట్లేదని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో అయినా ఇలాంటి  సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం. ఒకప్పుడు అంటే కేవలం ఒకరిద్దరు మాత్రమే తల్లి పాత్రలు చేసేవారు.. ఇప్పుడు మాత్రం చాలామంది ఆర్టిస్టులు తల్లి పాత్రలు చేసేందుకు సై అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: