ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో నిన్న ఒకే ఒక్కరోజున ష్టాక్ మార్కెట్ ఊహించని పతనం చెందడంతో కేవలం ఒకే రోజులో 7 లక్షల కోట్ల మదుపర ల సంపద ఆవిరి కావడంతో మళ్ళీ ష్టాక్ మార్కెట్ ఎప్పుడు పుంజుకుంటుందో ఎవరికీ తెలియని విషయంగా మారింది. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ ను తెలివిగా వాడుకుని తెలుగు రాష్టాలలో సినిమా ధియేటర్లను నాలుగు వారాల పాటు మూసివేసి లాభాలు పొందాలి అని ప్రయత్నించి ఫెయిల్ అయిన ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నలుగురు ప్రముఖుల పై నిన్న ఒక న్యూస్ ఛానల్ ఆసక్తికర కథనాన్ని ప్రసారం చేసింది.


ప్రస్తుతం పరీక్షల సీజన్ తో పాటు కరోనా ఎఫెక్ట్ తో ధియేటర్లు అన్నీ బోసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లను తమ చేతిలో పెట్టుకుని ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నలుగురు కి కలక్షన్స్ లేకపోవడంతో సినిమా హాల్స్ కు సంబంధించిన రెంట్స్ కూడ కట్టలేని పరిస్థితి అని అంటున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నలుగురు కి కోట్లల్లో నష్టాలు వచ్చే పరిస్థితులలో ఆ నష్టాలు తప్పించుకోవడానికి ఆ నలుగురు తెలుగు రాష్ట్రాలలోని సినిమా ధియేటర్లను ఒక నెలరోజుల పాటు మూసివేయాలని భావించారట. అయితే వారివారి ప్రయత్నాలకు నిర్మాతల మండలి నుండి అదేవిధంగా ఫిలిం చాంబర్ నుండి మద్దతు లభించక పోవడంతో ఆ నలుగురు ఆలోచనలు అమల జరగకపోవడంతో ఇప్పుడు షాక్ లో ఉన్నట్లు ఆ న్యూస్ ఛానల్ తన కథనంలో పేర్కొంది.


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుంటే కరోనా దెబ్బకు గతవారం విడుదలైన చిన్న సినిమాలు అన్నీ ఘోరంగా బలి అయిపోయినా బాలీవుడ్ మూవీ ‘బాఘీ 3’ కి మంచి కలక్షన్స్ రావడమే కాకుండా డబ్బింగ్ సినిమాగా విడుదలైన దుల్కర్ నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ మూవీలకు మంచి కలక్షన్స్ రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనితో ప్రేక్షకులకు సినిమా నచ్చితే చాలు కరోనా కూడ ఏమి చేయలేదు అన్న విషయాన్ని ఆ నలుగురు గ్రహించలేకపోయారు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: