స్వర్గీయ నటి శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ కపూర్ దఢక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైనా సంగతి తెలిసిందే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. దీనితో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. అందుకే సినిమా హిట్ అవ్వాలని అంటున్నారు. అలా తొలి అడుగుతోనే మంచి హిట్ని అందుకుంది. 

 

 


అయితే ఈ సినిమా తర్వాత అమ్మడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి ఒక్క ఫంక్షన్లో ఆమె దర్శనమిస్తూ వస్తుంది. అలా అక్కడ అందరి దృష్టిని తన వైపు మరల్చుకోవడానికి ప్రత్యేక డ్రెస్సులతో, మేకప్ లతో దర్శనమిస్తూ చూపరులను ఆకట్టుకుంది. అలా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. 

 

 


చూసేదానికి సన్నగా ఉన్న మరొక సినిమాలో నటించాలంటే అంతో కొంత ప్రత్యేకత ఉండాలని ఎప్పుడు జిమ్ లలో కసరత్తులు చేస్తూ వస్తుంది. బయట చిన్ని చిన్ని డ్రెసులతో కనిపించిన జాన్వీ మీడియా కెమెరాలకు చిక్కి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. కాగా ఇప్పుడు కాలేజీ ఈవెంట్లు, ఫంక్షన్లకు ఎక్కువగా అటెండ్ అవుతూ వస్తుంది. అయితే అక్కడ తన మాటలతో ఆకట్టుకుంటూ వస్తుంది. 

 

 


నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జాన్వీ తానూ నటించిన దఢక్ సినిమాలోని ' జింగాత్ ' పాటకు అక్కడివారితో కలిసి డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ కార్యక్రమానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం జాన్వీ నెట్‌ఫ్లిక్‌ సిరీస్‌ ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’లో కనిపించారు.అంతేకాక రెండో సినిమా ‘గుంజన్‌ సక్సేన్‌: ది కార్గిల్‌ గర్ల్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  జాన్వి  ‘రూహీ ఆఫ్జాన్‌’, ‘దోస్తానా 2’ సినిమాలలో నటిస్తుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: