ప్రస్థుతం కరోనా భయంతో ఎక్కడకక్కడ అన్ని పనులు నిలిచిపోయి జనం అంతా ఇళ్లకే పరిమితం అయిపోవడంతో బుల్లితెర పై ప్రసారం అవుతున్న గేమ్ షోలకు సినిమాలకు సీరియల్స్ కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇదిచాలదు అన్నట్లుగా జనం విపరీతంగా యూట్యూబ్ వీడియోలను చూడటమే కాకుండా నెట్ ఫ్లిక్స్ అమెజాన్ వంటి స్ట్రిమింగ్ సైట్స్ లో లభించే సినిమాలను చూస్తూ జనం కాలం గడుపుతున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం జనంకు బుల్లితెర కార్యక్రమాల పై ఏర్పడ్డ మోజును వెంటనే క్యాష్ చేసుకోవాలని ‘బిగ్ బాస్’ షోను నిర్వహించే స్టార్ మా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారంమేరకు మేలో ప్రారంభం కావలసిన ‘బిగ్ బాస్’ సీజన్ 4 కార్యక్రమాన్ని వచ్చేనెలకు ముందుకు జరిపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. 


వాస్తవానికి ఇప్పటికే ‘బిగ్ బాస్ 4’ సీజన్ లో పాల్గొనబోయే హౌస్ మేట్స్ గురించి స్టార్ ‘మా’ గత కొద్దిరోజులుగా తన అన్వేషణ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసే విషయంలో నాగార్జున అంగీకారం కూడ ఇంచుమించు స్టార్ మా తీసుకుంది. దీనికితోడు ఈ నెలలో ప్రారంభం కావలసిన ఐపీఎల్ వాయిదా పడటంతో ఇప్పట్లో ధియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు కాస్త వేగం పెంచి ఏప్రిల్ మొదటి వారం నుండి ‘బిగ్ బాస్ 4’ సీజన్ ను ప్రారంభించ గలిగితే ఆషోకు విపరీతమైన రేటింగ్స్ రావడమే కాకుండా స్పాన్స్ రింగులు రీత్యా మంచి బిజినెస్ వచ్చే ఆస్కారం ఉంది. 


అయితే ఈ ఆలోచనలు స్టార్ మా సంస్థకు వచ్చినా ప్రస్తుతం ఉన్న కరోనా సమస్యలతో ‘బిగ్ బాస్’ హౌస్ లో సుమారు రెండు నెలల పాటు బుల్లితెర పై కనిపించే హౌస్ మేట్స్ తో పాటు ఆ షోను బ్యాకెండ్ లో సపోర్ట్ చేస్తూ ‘బిగ్ బాస్’ ఇంటిని కనిపెట్టుకుని ఉండే టీమ్ సుమారు 100 మంది ఉండే పరిస్థితిలో ఇంతమంది ఒకే చోట కలిసి ఉండటానికి అనుమతులు లభిస్తాయా అన్నదే ప్రశ్న..   

మరింత సమాచారం తెలుసుకోండి: