రామ్ గోపాల్ వర్మ ఈ పేరు అందరికి సుపరిచితమే. వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు . తన దైన శైలిలో విమర్శలు చేస్తూ  మీడియా లో హాట్ టాపిక్ గా మారతాడు. ఎవరి గూర్చి ట్వీట్ చేయాలన్న గాని ఆలోచించడు. అలాగే  ఎలాంటి సినిమా తీయాలన్న గాని ఆలోచించాడు. నెటిజన్లు ఎమన్నా గాని పట్టించుకోడు. అయితే ఈ సారి వర్మ మరోసారి  సోషల్ మీడియా లో సెటైర్లు వేసాడు. ఈ సారి ఏకంగా ప్రజలపైనే విమర్శలు చేసాడు.  ఇప్పుడు సోషల్ మీడియా లో  చేసిన  ఈ ట్వీట్  మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు వివరాలలోకి వెళితే  కరోనా వ్యాప్తి ని అరికట్టే దిశగా  ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ పాటించారు. నరేంద్ర మోడీ మాటని గౌరవించి ఎవరికి వారు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ సందర్భంగా  మోడీ  ఒక సందేశాన్ని  కూడా ప్రజలకి తెలియచేసారు.  తమ ప్రాణాలని సైతం  లెక్కచేయకుండా  కరోనా బాధితులకి  వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, మీడియా వాళ్ళ  కోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు అందరు ఇంటినుంచి బయటకు వచ్చి  చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపమన్నారు. అలాగే ప్రజలు కూడా చప్పట్లతో  జేజేలు కొట్టారు.

 

 

 

  అయితే ఇవాళ మాత్రం లాక్ డౌన్ ఉన్నప్పటికీ అవన్నీ లెక్క చేయకుండా తిరిగేస్తున్నారు.  లాక్ డౌన్ నిబంధనల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా యధేచ్ఛగా రోడ్లపై తిరిగారు.దీనిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీరియస్ గా స్పందించారు . లాక్‌డౌన్‌ ప్రభుత్వం ఎందుకు పెట్టిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు ప్రధాని. మనకోసం, మనదేశం కోసం, మనందరి కోసం లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వర్మ సైతం జనం తీరుపై  అసహనం వ్యక్తం చేసారు. నిన్న ఎవరికోసం అయితే చప్పట్లు కొట్టి  జేజేలు చెప్పారో,  ఇవాళ వారినే ప్రజలు పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. యదేచ్చగా బయట తిరిగేస్తున్నారు. నాకేంటి అనే భావనతో ఉన్నారు ప్రజలు అని కొనియాడారు. ఇదే భారతీయుల గొప్ప సంఘీభావం అంటూ సెటైర్లు వేశారు. 

 


అయితే  వర్మ ట్వీట్‌పై కొందరు నెటిజన్స్ మండిపడుతుంటే, మరి కొందరు సపోర్ట్ చేస్తున్నారు. కొందరు అయితే  ‘మరి నీ డ్యూటీ ఇలా నాన్ సెన్స్ ట్వీట్స్ వేయడమా ? సడన్లీ రెస్పాన్స్ బుల్ సిటిజిన్ లెక్క మట్లాడకు’ అని ఓ నెటిజన్ వర్మ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. అయితే చాలామంది మాత్రం వర్మ ట్వీట్‌కు మద్దతు పలికారు.  నిజం చెప్పారు సార్ మీరు , బాగా చెప్పారు అంటూ కామెంట్స్ పెట్టారు. మరికొందరు భారతీయులు అంతే ఎవరూ మార్చలేరంటూ బదులిచ్చారు. మరో నెటిజన్ డైలీ లైఫ్‌‌లో కొన్ని పనుల  ఉంటాయి  వాటి  కోసం బయటకు వెళ్లకుండా  ఇంట్లోనే  ఉంటే అవసరాలు ఎలా తిరురుతాయ్  సార్ అంటూ ప్రశ్నించారు. ఇలా అయితేనేమి వర్మ చేసిన ట్వీట్ కి నెటిజన్లు బాగానే  రిప్లై ఇస్తున్నారు. వర్మ ఏది చేసిన సంచలనమే కదా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: