ఐదారేళ్లుగా కామెడీకి కేరాఫ్  అడ్రెస్ గా ఉంటూ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్న ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. ఈ షో వల్ల ఎంతోమంది ఆర్టిస్టులు మంచి కెరియర్ సంపాదించారు. తమ కామెడీతో ఆడియెన్స్ ను నవ్వించే ఈ షోని ఢీ కొట్టే మరో షో రాలేదని చెప్పాలి. జబర్దస్త్ తో పాటుగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా ఆడియెన్స్ ను మెప్పిస్తుంది. అయితే షోలో ఎంతమంది కమెడియన్లు ఉన్నా హైపర్ ఆది క్రేజ్ వేరు. ఆది స్కిట్ వచ్చింది అంటే పంచులు ప్రవాహంలో వస్తాయి. వాటిలో ఒకటి అర్ధం చేసుకుని నవ్వేసరికి మరోటి వస్తుంది.

 

అదిరే అభి టీం తో జబర్దస్త్ కు పరిచయమైనా ఆది సొంతంగా టీం పెట్టడమే కాదు జబర్దస్త్ ను నడిపించే స్థాయికి ఎదిగాడు. తన టీమ్ లో రాజు, దొరబాబు, పరదేశి లాంటి వారు ఉంటారు. ఈమధ్యనే దొరబాబు, పరదేశిలు వైజాగ్ లో వ్యభిచార గృహంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఆ ఎఫెక్ట్ వారి కెరియర్ మీద పడుతుందని అనుకున్నా రెండు వారాల ఉంది ఆది స్కిట్ లో దొరబాబు, పరదేశి కనిపించారు. ఈ వారం ఎపిసోడ్ లో కూడా దొరబాబు, పరదేశిలు ఆది స్కిట్ లో ఉన్నారు. ఒకవేళ ఆది పెద్ద మనసు చేసుకుని వదిలేశాడని అనుకున్నారు. అయితే ఏప్రిల్ 2న టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్ ప్రోమోలో వాళ్ళు మిస్ అయ్యారు. 

 

జబర్దస్త్ నుండి దొరబాబు, పరదేశిలు బయటకు వచ్చినట్టే అని తెలుస్తుంది. మంచి కెరియర్ ను చేజేతులారా నాశనం చేసుకున్న వారికి వేరే ఛాన్సులు రావడం కూడా కష్టమే అని చెప్పొచ్చు. దొరబాబు ఆల్రెడీ బి గ్రేడ్ సినిమాలు తీసి వచ్చాడని ఆది స్కిట్స్ లో పంచులు వేస్తుంటాడు. అదే పనికోసం పోలీసులకు పెట్టుబడి కెరియర్ సర్వ నాశనం చేసుకున్నారని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: