కరోనా గందరగోళంలో కీర్తి సురేష్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి సందడి లేకుండా.. కీర్తి సురేష్ పెళ్లి వార్త ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోంది. కీర్తి 2020 డైరీ ఫుల్ ఉన్న టైమ్ లో పెళ్లి  ప్రస్తావన ఏంటి.. కీర్తి ఆల్ రెడీ ప్రేమలో ఉందా.. లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లా.. ఇలా చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇంతకీ కీర్తి సురేష్ పెళ్లి కథ ఏంటో ఓ సారి పరిశీలిస్తే.. 

 

కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతోందని.. కుటుంబ సభ్యులు ఇప్పటికే వరుడిని చూసినట్టు కథనాలు మీడియాలో నడుస్తున్నాయి. బీజేపీ నాయకుడి కుమారుడిని కీర్తి సురేష్ పెళ్లాడబోతోందని.. ఈ ఏడాది చివరిలో వీరి వివాహానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే దీనికి సంబంధించి కీర్తి కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. ఈ వార్త నిజమేనంటున్నాయి మీడియా వర్గాలు. 

 

మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. దర్శకుడు కుకునూర్ నగేశ్ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రామా గుడ్ లక్ సఖి సినిమాలో నటిస్తోంది. ఇందులో కీర్తి డీ-గ్లామర్ పాత్రలో కనిపించనుంది. మహానటి తర్వాత తెలుగులో నటించిన మిస్ ఇండియా విడుదల రెడీగా ఉంది. నితిన్ నటిస్తున్న రంగ్ దే లో కూడా  కీర్తి సురేష్ హీరోయిన్. 

 

రజనీకాంత్ నటిస్తున్న అన్నాతే చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజు పెంగ్విన్.. మోహన్ లాల్ నటిస్తున్న మలయాళ చిత్రం మరక్కార్ లో నటిస్తోంది కీర్తి. ఇన్ని సినిమాలు చేతిలో పెట్టుకొని.. పెళ్లికి రెడీ అంటుందా.. అనే డౌట్ ఫిలిమ్ వర్గాల్లో ఉంది. మరి ఈ పెళ్లి వార్తను కీర్తి ఫ్యామిలీ వ్యతిరేకిస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: