టాప్ హీరోలు ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ నే ప్రిఫర్ చేస్తుంటారు. మార్కెట్ లెక్కలని మ్యాచ్ చేసే కాంబినేషన్స్ కే ఓటేస్తుంటారు. అయితే చిరంజీవి మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తుంటాడు. రీఎంట్రీలో రీఇన్వెన్షన్ అంటూ ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు.

 

చిరంజీవి రీఎంట్రీ ఇచ్చినప్పుడు బోల్డన్ని లెక్కలు చూసుకున్నాడు. కమర్షియల్ హంగులు, క్రేజీ కాంబినేషన్ ఇలా బోల్డన్ని లెక్కలతో ఖైదీ నెంబర్ 150లో నటించాడు. అయితే ఇప్పుడు మాత్రం ఈ కాలిక్యులేషన్స్ అన్నింటిని పక్కనపెట్టి, యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలనుకుంటున్నాడు. బాబీ, సుజిత్ లాంటి మేకర్స్ తో సినిమాలకు కమిట్ అవుతున్నాడు చిరు. 

 

చిరంజీవి తర్వాత మళయాళం హిట్ లూసిఫర్ లో నటించబోతున్నాడు. ఈ రీమేక్ బాధ్యతలను సుజిత్ కు అప్పగించాడు. సాహోతో అంతగా మెప్పించలేకపోయిన సుజిత్ కు చిరు మెగా ఆఫర్ ఇచ్చాడు. అలాగే కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం చూస్తోన్న బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి. 

 

చిరంజీవి మరో కాంబినేషన్ ను కూడా ఎనౌన్స్ చేశాడు. శక్తి, షాడో లాంటి డిజాస్టర్స్ తో కనిపించకుండా పోయిన మెహర్ రమేశ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు చిరంజీవి. ఇదే ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. బోల్డన్ని కాలిక్యులేషన్స్తో సినిమాలు చేసే చిరంజీవి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటని ఆరాలు తీస్తున్నారు. 

 

డిజిటల్ ప్లాట్ ఫామ్ కు అలవాటు పడిపోయిన ఆడియన్స్ రెగ్యులర్ స్టోరీస్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. కంటెంట్ కొంచెం కొత్తగా ఉంటే థియేటర్లకు వెళుతున్నారు. వాళ్లను ఆకట్టుకోవడానికి కొత్తగా మారాలనుకుంటున్నాడు చిరంజీవి. ఈ థాట్స్ నుంచే యంగ్ మేకర్స్ తో సినిమాలు చేస్తే కొత్త అవతారంలో చూపిస్తారని ఫీలవుతున్నాడట. 

 

స్టార్ డైరెక్టర్లు చాలా మందికి స్పెషల్ ఇమేజ్ వచ్చేసింది. వినాయక్ మాస్ సినిమాలు, బోయపాటి యాక్షన్ సినిమాలు అనే ముద్రపడింది. ఇక ఈ దర్శకులు కూడా ప్రేక్షకుల అంచనాల్లో సినిమాలు తీస్తున్నారు. కానీ సుజిత్ లాంటి దర్శకులు హాలీవుడ్ స్టైల్ లో వెళుతున్నారు. మేకింగ్ లో హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఫాలో అవుతున్నారు. అందుకే సాహో ని భారీగా తీశాడు సుజిత్. చిరంజీవి కూడా ఇలాంటి ఎక్స్ పరిమెంట్స్ లోకే వెళ్లాలనుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: