మార్చి మొదటివారం నుండి తెలుగు రాష్ట్రాలలో కరోనా భయాలు పెరిగిపోవడంతో జనం సినిమాలు విడుదల అవుతున్నా ధియేటర్లకు రావడం మానేశారు. ఇక మార్చి 20 నుండి తెలంగాణా ప్రభుత్వం ధియేటర్ల పై ఆంక్షలు విధించడం ఆతరువాత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ రావాడంతో సినిమా ధియేటర్లు అన్నీ మూతపడిపోయాయి. వచ్చేనెలలో కూడ లాక్ డౌన్ కొనసాగుతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. 


దీనితో అన్ని రంగాలు నష్టపోయినా అన్ని రంగాల కంటే చాలఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీ నష్టపోయింది. సినీ పరిశ్రమలోని 24 క్రాప్ట్స్ మూతపడ్డాయి. ఇప్పటికే విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న కొన్ని మిడిల్ రేంజ్ భారీ సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ ఆమూవీ నిర్మాతలు హడిలిపోతున్నారు. ఈక్రమంలో సినీ రంగానికి చెందిన వారు ప్రత్యామ్నాయ వైపు దృష్టిపెట్టారు. 


ప్రస్తుతం జనం అంతా ఈ లాక్ డౌన్ సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు అంటిపెట్టుకుని ఉండటంతో ఇక రానున్న రోజులలో వీటి హవా మరింత పెరిగిపోతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ ప్రముఖులు అంతా బయటకు ధైర్యంగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ సినిమా ధియేటర్లకు ప్రత్యామ్నాయం కాదు అని బయటకు ధైర్యంగా చెపుతున్నా లోలోపల ఎదో భయం వారిని కూడ వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఒటిటి ప్లాట్ ఫామ్ డైరెక్ట్ గా విడుదల అవుతున్న ఒక చిన్న సినిమా ఫలితం తెలుగు సినిమా నిర్మాతల ఆలోచనలను ఏమేరకు ప్రభావితం చేస్తుంది అనే విషయం పై అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 


ఈరోజు ‘అమృతరామమ్’ అనే చిన్న సినిమా జీ5 లో విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈ సినిమాను ఉగాది పండుగ రోజున విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే లాక్ డౌన్ తో ఆగిపోయిన అన్ని సినిమాలతో పాటు ఈసినిమా కూడ ఆగిపోయింది. థియేటర్లలో విడుదల కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై వస్తున్న తొలి తెలుగు చిత్రంగా ‘అమృతరామమ్’ ఒక రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా ప్రేమకథల్లో హీరోలే త్యాగాలు చేస్తుండగా హీరోయిన్ పిచ్చిగా ప్రేమిస్తే ఆమె చేసే త్యాగాలు ఎలా ఉంటాయి అన్న కొత్త అంశం చుట్టూ ఈచిన్న సినిమా ఉంటుంది. ఇప్పుడు ఈప్రయోగం సక్సస్ అయితే మరికొన్ని రిలీజ్ కు రెడీగా ఉన్న చిన్నసినిమాలు ఇదే బాటపడితే ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న నాని ‘వి’ అనుష్క ‘నిశ్శబ్దం’ రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రదీప్ ’30 రోజులలో ప్రేమించుకోవడం ఎలా’ లాంటి అనేక సినిమాల భవిష్యత్ ను నేడు విడుదల అవుతున్న ‘అమృతరామమ్’..

మరింత సమాచారం తెలుసుకోండి: