ప్రపంచ వ్యాప్తంగా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది..కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సినీ రాజకీయ ప్రముఖులు సూచించారు..

 

 

 

 

 

 

కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..

 

 

 

 

 

 

 

కరోనా లాక్ డౌన్ కారణంగా నిరుపేదలు, నిత్య కూలీలు అవస్థలు పడుతున్నారు. చిన్న చితక పనులు చేసుకునేవారి పరిస్థితీ మరీ దయనీయంగా మారింది. దీంతో దాతలు స్పందిస్తున్నారు. లాక్ డౌన్ లో పస్తులుంటున్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ... దాతృత్వం చాటుకుంటున్నారు. ఇక లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు పరిశ్రమ మొత్తం కదిలింది. మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన కరోనా క్రైసిస్ చారిటీ సంస్థకు భారీగా విరాళాలు అందిస్తున్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది మొదలు ఇతర పేద సినీ కార్మికులకు ఈ చారిటీ తరుపున నిత్యావసరాలు అందిస్తున్నారు. 

 

 

 

 

 

 

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలో అన్న విషయాలను సినీ తారలు తెలియ పరుస్తున్నారు..అయితే సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కరు ఒక్కోలా జాగ్రత్తలు తెలుపుతున్నారు.. ఈ మేరకు చాలా మంది పాటలతో కవితలతో తెలియజేస్తున్నారు.. కరోనా ను కట్టడి చేయడంలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరుతూ .. కొందరు పేదల ఆకలి తీర్చడానికి ముందుకొస్తున్నారు.. సినిమాలలో నే కాదు భయ్య నిజ జీవితంలో కూడా వీళ్ళు గ్రేట్ అని అంటున్నారు ప్రజలు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: