తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సంగీతాన్ని పరిచయం చేసి గొప్ప సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని ప్రత్యేక పేజీలు లిఖించుకున్నాడు ఇళయరాజా. ఇళయరాజా సంగీతం వినసొంపుగా... మనసుకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మాస్  సాంగ్ అయినా మెలోడీ సాంగ్ అయినా... సంగీత ప్రాధాన్యమైన సాంగ్ అయినా... తనదైన నైపుణ్యంతో సంగీతం సమకూర్చి సంగీత ప్రేక్షకులందరినీ మెప్పించగల ప్రతిభ   ఇళయరాజా సొంతం . తెలుగు చిత్ర పరిశ్రమలో భద్రకాళి అనే సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన ఇళయరాజా ఆ తర్వాత తనదైన సంగీత నైపుణ్యం తో ఎంతో మంది సంగీత ప్రేక్షకులను అలరించి అంచెలంచెలుగా ఎదిగిన విషయం తెలిసిందే. 

 


 తనదైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు ఇళయరాజా. ముఖ్యంగా కమలహాసన్ కె.విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన సాగరసంగమం సినిమా పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రేక్షకులకు ఎంతలా మైమరిపింప  చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాగరసంగమం సినిమాలో పాటల విషయంలో ఇళయరాజా ప్రతిభ మొత్తం బయట పడింది. అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చి  సంగీతానికి మారు పేరులా మారిపోయారు సంగీత దర్శకుడు ఇళయరాజా. సాగర సంగమం సినిమాలో  సంగీతాన్ని కొత్త ఒరవడి తొక్కించి  ఆ తర్వాత స్వాతిముత్యం సినిమా కూడా ఇళయరాజా కెరియర్ను కీలక మలుపు తిప్పింది. 

 


 ఇక అప్పట్లో కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాల్లో సంగీత దర్శకుడు ఇళయరాజా పనిచేసేవారు. ఇక చిరంజీవి సినిమాలో ఇళయరాజా అందించిన సంగీతం ఆ సినిమాలకు వెన్నుముక నిలిచింది. ఇక సన్నివేశానికి తగ్గట్లుగా పాటను సమకూర్చడంలో ఇళయరాజా పెట్టింది పేరు. ఇక సంగీతంలో తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించి సంగీత ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సంగీత దర్శకుడు ఇళయరాజా దిట్ట అనే చెప్పాలి. ఈ క్రమంలోనే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కు కూడా ఇళయరాజా సంగీతం అందించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని అబ్బనీ తీయని దెబ్బ అనే పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ పాటలో  ఇళయరాజా సమకూర్చిన సాహిత్యం సంగీతం  తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: