బాలకృష్ణ సినిమా షూటింగ్ లకు వచ్చాడు అంటే చాలు అందరిచేత ‘బాల’ అని పిలిపించు కోవడం ఒక సరదా. అయితే అతడి సరదాను అతడి వయసు గుర్తించడం లేదు. మరొక వారంరోజులలో బాలయ్య షష్టిపూర్తి పెళ్ళికొడుకు కాబోతున్నాడు. రాబోతున్న జూన్ 10వ తారీఖున బాలయ్య పుట్టినరోజుతో ఈ నందమూరి సింహానికి  60వ సంవత్సరాలు నిండుతున్నాయి.


దీనితో ఈసందర్భాన్ని చాలఘనంగా నిర్వహించాలని గత 6 నెలలుగా బాలకృష్ణ కూతుళ్ళు అల్లుళ్ళు వేసుకున్న మాష్టర్ ప్లాన్ ను కరోనా దెబ్బతీసింది. అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ బాలయ్య షష్టిపూర్తి వేడుకలను చాల విభిన్నంగా నిర్వహించడానికి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ప్లాన్ చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ ఈవెంట్ ను టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక పెద్ద ఈవెంట్ గా ప్లాన్ చేయాలని భావించారు.


అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలించక పోవడంతో నందమూరి కుటుంబ సభ్యులు అతడి సన్నిహితుల మధ్య ఈకార్యక్రమాన్ని బాలకృష్ణ ఇంటిలోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అభిమానులకు జోష్ ను కలిగించడానికి బాలకృష్ణ సోషల్ మీడియా ఎంట్రీ బాలయ్య షష్టిపూర్తి రోజు ఉండే విధంగా చాల గ్రాండ్ గా బాలయ్య కూతుళ్ళు అల్లుళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అంతేకాదు బాలకృష్ణ సోషల్ మీడియా ఎంట్రీ అదిరిపోయే విధంగా ఉండటానికి బాలయ్యతో ఒక పాట పాడించి ఆ పాటను తన అభిమానులకు అతడి షష్టిపూర్తి సందర్భంగా అభిమానులకు అంకితం చేస్తారని వార్తలు వస్తున్నాయి.


ఇప్పటి వరకు సోషల్ మీడియాకు చాల దూరంగా ఉన్న బాలకృష్ణ కూడ సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వబోతు ఉండటంతో టాప్ సీనియర్ హీరోలు కూడ సోషల్ మీడియా ప్రాముఖ్యతను ఎంతగా గుర్తిస్తున్నారో అర్ధం అవుతుంది. బాలయ్య కుటుంబ సభ్యులు అంతా పాల్గొనే ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను పిలుస్తారా ? అన్న సస్పెన్స్ అభిమానులలో కొనసాగుతోంది. జూనియర్ బాలయ్యలు ప్రస్తుత పరిస్థితులలో ఏకంకావాలి అని కోరుకుంటున్న నందమూరి అభిమానుల ఆశలు రీత్యా బాలయ్య షష్టిపూర్తి వేడుకలలో జూనియర్ సందడి చేస్తే అది నిజంగానే నందమూరి అభిమానులకు ఒక పండుగ..    

మరింత సమాచారం తెలుసుకోండి: