ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఓ రైతు పడిన కష్టం.. మీడియా ద్వారా మరెక్కడో ముంబైలో ఉన్న నటుడు సోనూసూద్‌ను కదిలించింది. అంతే సాయం గంటల వ్యవధిలో అందింది. ఓ రైతు కష్టాన్ని నటుడు సోనూసూద్ అందుకున్న తీరు ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. సోనూసూద్ దానగుణాన్ని అన్నివర్గాల వారు మెచ్చుకుంటున్నారు.
![]()
సోనూసూద్‌పై తెలుగు సినీపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రెటీలు కూడా స్పందించారు. కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న సూపర్ మేన్ ఏపీ రైతు విషయంలోనూ అంతే ప్రేమతో స్పందించారని దర్శకుడు మెహర్ రమేశ్ ట్వీట్ చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సోనూ సాయానికి హద్దుల్లేవని మెచ్చుకున్నారు.
Thank u so much my brother for all the love and encouragement. love you loads ❤️🙏 https://t.co/kPBfIkahhu
— sonu sood (@SonuSood) July 26, 2020
మరో దర్శకుడు క్రిష్ స్పందిస్తూ.. అద్భుతమైన మనిషికి.. అత్యుద్భుతమైన సూపర్ మేన్‌కూ శాల్యూట్ అంటూ కామెంట్ పోస్టు చేశారు.. క్రిష్ సార్.. అంటూ సోనూ దీనికి స్పందించాడు..
Krishhhhhh sirrrrr❤️❤️❤️🙏🙏🙏 https://t.co/S4xB4kLzmH
— sonu sood (@SonuSood) July 26, 2020
మృత్యుంజయ్ అనే తెలుగు కార్టూనిస్టూ.. సోనూను సూపర్ మేన్‌గా పోలుస్తూ ఓ కార్టూన్ వేసేశారు..
#SonuSoodRealHero #SonuSood pic.twitter.com/kdnVt05lph
— mrityunjaycartoonist (@chmrityunjay) July 26, 2020
రైతును ఆదుకున్న సోనూసూద్‌కు తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసిసియేషన్ కూడా కృతజ్ఞతలు తెలిపింది.
— sonu sood (@SonuSood) July 26, 2020
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి