దసరా ఫిలిం ఫెస్ట్.. ఈ సారి ప్రేక్షకులకు అస్సలు లేకుండా పోయింది. ఏ ఒక్క హీరో , నిర్మాత, దర్శకుడు దసరా, క్రిస్ట్ మస్ పేరుతో తమ సినిమాలు రిలీజ్ అవుతున్నట్లుగా ఎక్కడా  ప్రకటించలేదు. అంటే పరిస్థితులు ఇప్పట్లో మెరుగపడవనే విషయం వారికి బాగా తెలుసు. అందుకే రిలీజింగ్ డేట్ల మ్యాటర్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

దసరా అనగానే అప్పట్లో టాప్ హీరోల సినిమాలు క్యూ కట్టి మరీ రిలీజ్ అయ్యేవి. తర్వాత కాలంలో సంక్రాంతి, సమ్మర్ సీజన్ కు డిమాండ్ పెరగడంతో.. రానురాను దసరా సీజన్ సినిమాల ప్రారంభోత్సవాలకు వేదికగా మారిపోయింది. దసరాకు లాంచ్ అయిన సినిమా.. కుదిరితే సంక్రాంతి లేదంటే సమ్మర్ కు రిలీజ్ అయ్యేది. ఇప్పుడున్న పరిస్థితులలో ఆ ఛాన్స్ కూడా లేదనే విషయం అర్ధమైపోతుంది. చివరకు ప్రెస్టీజియస్ పిక్చర్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ దసరాకు లాంచ్ కాని పరిస్థితి. అయితే రేణు దేశాయ్ నటిస్తున్న ఆద్య ఫిలిం మాత్రమే ఈ దసరాకు లాంచ్ అయిన ఏకైక నోటెడ్ పిక్చర్.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్న రానా అరణ్య ఫిలిం.. సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. లాక్ డౌన్ ముందే మెజారిటీ షూట్ పూర్తి చేసుకున్న ఈ ఫిలిం.. నిజానికి జూలైలోనే ప్యాచ్ వర్క్ తో పాటు  పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని దసరా సినిమాగా రిలీజ్ అవ్వాల్సి ఉంది. థియేటర్ సిస్టమ్ ఇప్పట్లో కోలుకోదని క్లారిటీ తెచ్చుకున్న అరణ్య  చిత్ర నిర్మాతలు ఈ సినిమాను ఎంతో ముందుచూపుతో సంక్రాంతికి తీసుకుపోయారు. లేకపోతే  మనం ఇప్పటికే ఈ సినిమాను చూసేవాళ్లం.

అక్కినేని కాంపౌండ్ హీరోలైన చైతు,అఖిల్ కూడా అన్నీ వర్కవుట్ అయితే ముందుగా ఈ దసరాకే మన ముందుకు రావాలనుకున్నారు. అనివార్య కారణాలతో ప్యాచ్ వర్క్ లు లేటవ్వడంతో సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ల దగ్గరే ఆగిపోయాయి. అయితే ఎప్పటినుంచో చెక్కుతున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎట్టి పరిస్థితులలో ఈ దసరాకే వస్తుందనుకున్నారు. థియేటర్ వ్యవస్థ సరిగా లేనప్పుడు ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడం అనవసరం అనుకుని సంక్రాంతికి తమ సినిమాను లాక్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: