సాయి పల్లవి హీరో ఇమేజ్ కంటే తన క్యారెక్టర్‌కే ఇంపార్టెన్స్ ఇస్తుంది. సినిమాలో స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితేనే సంతకం చేస్తుంది. ఇలాంటి స్ట్రాంగ్ రోల్ కోసం చిరంజీవి అండ్ టీమ్ సాయి పల్లవిని కాంటాక్ట్ చేసిందట. "వేదళం' రీమేక్‌లో చిరు చెల్లెలి పాత్ర కోసం పల్లవిని కలిశారనే ప్రచారం జరిగింది. కానీ మెగాహీరో చెల్లెలిగా నటించడానికి నో చెప్పిందట రౌడీ బేబీ. దీంతో కీర్తీ సురేశ్‌ని తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
"అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌లో పవన్ కళ్యాణ్ జోడీగా సాయి పల్లవిని తీసుకోవాలనుకుంటున్నారట మేకర్స్. కొంచెం రెబల్ క్యాండిడేట్‌లా కనిపించే మిసెస్ అయ్యప్పనుమ్ క్యారెక్టర్‌కి హైబ్రిడ్ పిల్ల అయితే బాగుంటుంది అనుకుంటున్నారట.
సాయి పల్లవి ఇప్పటికే వరుణ్‌తేజ్‌తో "ఫిదా' సినిమా చేసింది. భానుమతి హైబ్రిడ్ పిల్లా అంటూ వరుణ్‌ని డామినేట్ చేసింది. మరి అబ్బాయికి జోడీగా నటించిన పల్లవి ఇప్పుడు బాబాయ్‌తో స్టెప్పులు వేయడానికి ఓకే చెబుతుందా.. లేకపోతే ఏజ్ గ్యాప్ అని పవన్‌కి కూడా హ్యాండ్ ఇస్తుందా అనేది క్వశ్చన్ మార్క్‌గా మారుతోంది.
నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి నానాటికీ క్రేజ్ పెరిగిపోతోంది. అవకాశాలు అలానే వస్తున్నాయి.. హిట్ లు అలానే పడుతున్నాయి. సాధారణ పక్కింటి అమ్మాయిలా.. నాజుగ్గా కనిపించడం.. తనదైన సహజనటనతో మెప్పిస్తోంది. ఇదే దర్శక, నిర్మాత, హీరోలకు తెగ నచ్చేస్తోంది. ఆమె తమ సినిమాల్లో నటిస్తే బాగుంటుందని తెగ ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే ఆమె మాత్రం తనకు నచ్చని సినిమాలను రిజక్ట్ చేస్తూ.. నచ్చిన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి