అక్కినేని కోడలు సమంత ఇప్పుడు ఏకంగా తన మామ గారు నాగార్జున కు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు ఆమె ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ కార్యక్రమానికి విపరీతమైన స్పందన వస్తోంది. దీనితో ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కు సబ్ స్క్రైబర్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో అల్లు అరవింద్ జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


సమంత కూడ ఈ కార్యక్రమాన్ని చాల వెరైటీగా హోస్ట్ చేస్తూ అనేకమంది ప్రముఖ సెలెబ్రెటీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో రానా విజయ్ దేవరకొండ తమన్నా లాంటి స్టార్లతో ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి. ఇక ఈ లిస్టులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడ చేరబోతున్నాడు.


ఈ కార్యక్రమాన్ని చాల డిఫరెంట్ గా సమంత డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమ రికార్డింగ్ ఇప్పటికే పూర్తి అయి ఈ వీకెండ్ నుండి ఆహా లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అల్లు అర్జున్ కు సమంత తనదైన శైలిలో స్పెషల్ గూడీస్ ఇన్విటేషన్ ఇచ్చింది.
బన్నీ స్వయంగా ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారా వెల్లడించాడు. వైన్ బాటిల్ సరికొత్త మొబైల్ ని బహుమతిగా సమంత ఇచ్చిందని బన్నీ తన అభిమానులకు తెలియచేసాడు.


ఎపిసోడ్ లో బన్నీ వ్యక్తిగత విషయాల గురించి సమంత తనదైన తీరులో ప్రశ్నించి ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించడానికి తనవంతు ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం సమంత యాంకర్ గా కొనసాగిస్తున్న దూకుడు చూస్తుంటే వచ్చే ఏడాది ‘బిగ్ బాస్ సీజన్ 5’ ను ఆమె హోస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు అని అనిపిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల ద్వారా తన సత్తా చాటాలని సమంత చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాకపోయినా ఆహా కార్యక్రమాల ప్రజెంటర్ గా సమంత తన మామ నాగార్జున కు గట్టిపోటీ ఇస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: