ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులలో  ఎంతో ఉత్కంఠ కలిగిస్తోంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో.  దాదాపు వంద రోజుల నుంచి బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ వచ్చిన బిగ్బాస్ తెలుగురియాలిటీ షో ప్రస్తుతం క్లైమాక్స్ కి చేరుకుంది అన్న విషయం తెలిసిందే.  ఈవారం తో బిగ్బాస్ షోకి ఎండ్  కార్డు పడుతుంది అన్న విషయం తెలిసిందే.  ఈ ఆదివారమే గ్రాండ్ ఫినాలే జరగబోతుందోడగా  ఇక బిగ్ బాస్ విన్నర్ గా  ఎవరు నిల్వ బోతున్నారు అనేదానిపై ప్రస్తుతం ఎంతో ఆసక్తి నెలకొంది.  ప్రస్తుతం టాప్ ఫైవ్ లో అభిజిత్ సోహెల్ అఖిల్ హారిక అరియనా  ఉన్నారు.



 ఇక ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరు కాబోతున్నారు రన్నరప్ గా  ఎవరు నిలవబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది ప్రస్తుతం బుల్లితెరపై అంతా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనే దానిపైనే చర్చ జరుగుతుంది అనే విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.  ఎవరూ ఊహించని వారికి ఈ సారి టైటిల్ లభిస్తుంది అన్న సారాంశం కలిగిన వార్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. వాస్తవంగా అయితే బిగ్ బాస్ టైటిల్ రేసులో గత కొన్ని రోజుల నుంచి అభిజిత్ అందరికంటే ముందున్నాడు.


 ఇక అభిజిత్ కు ప్రస్తుతం ఎంతగానో మద్దతు లభిస్తోంది..  అభిజిత్ తర్వాత టైటిల్ రేసులో అఖిల్ సోహెల్ వరుసగా ఉన్నారు.  ఒకవేళ అభిజిత్ కి టైటిల్ రాలేదు అంటే అఖిల్ లేదా సోహెల్ కి టైటిల్ వచ్చేఅవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు కానీ ఈ ముగ్గురికి కాకుండా ఈసారి హారిక టైటిల్ గెలుచుకో  పోతుంది అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇటీవలే దీనికి సంబంధించిన ఒక అనధికారిక పోస్ట్ కూడా వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ పోస్టులో నలభై శాతం ఓట్లు హారికకు రాగా తర్వాత స్థానంలో సోహైల్ అఖిల్ అభిజిత్ ఉన్నారు. అరియనా  చివర్లో ఉంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఎవరో ఫోటోలను మార్పింగ్ చేశారు అని అభిజిత్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ పోస్ట్ పై మండిపడుతున్నట్లు తెలుస్తోంది.  ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: