అంత అందం మరియు టాలెంట్ ఉన్నప్పటికీ కాలం కలిసి రాలేదు పాయల్ కి. వెంకీ మామ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ ఆ పాత్ర పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించ లేకపోయింది. ఆ తర్వాత అనగనగా ఒక అతిథి చిత్రంలో నటించింది. అయితే ఇది కూడా ఆమెకు మంచి బ్రేక్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు తన పవరేంటో చూపించాలని "5W" సినిమాతో మన ముందుకు రానున్నారు పాయల్ రాజ్ పుత్. 5W క్వశ్చన్స్ అంటే అందరికీ ఐడియా ఉండనే ఉంటుంది. ఎందుకు..? ఏమిటి..?. ఎలా..? ఎవరు..? ఎక్కడ..? అనే ప్రశ్నలు. ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్తో సినిమా పేరు పవర్ ఫుల్ గా ఉంది.
ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా గా రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రంలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికొస్తే....లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించినా కొన్ని కారణాల వల్ల మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చింది. కాగా ఇటీవలే చిత్రయూనిట్ షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి