అంతేకాదు ఇక మొదటి వారం నుంచి ఎలిమినేషన్ ప్రక్రియలో కొనసాగుతూ వచ్చిన దేత్తడి హారిక.. ఎంతో మంది ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సంపాదించుకొని టాప్ 4 గా నిలిచింది అనే విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజుల సమయంలో ఎంతో పాపులారిటీ సాధించింది. ఇక సాధారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ కి సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దేత్తడి హారికకు కూడా ఒక సూపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దాదాపు అందరు కంటెస్టెంట్స్ కి మంచి సినిమా అవకాశాలు అందుకున్నారు. ఇప్పుడు హారికకు మంచి సినిమా అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. శర్వానంద్ హీరోగా పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న శ్రీకారం సినిమాలో దేత్తడి హారిక ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. కాగా శ్రీకారం అనే సినిమాలో శర్వానంద్ కి జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ నటిస్తోంది. అయితే ఇక దేత్తడి హారిక కు సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారి పోవడం తో అభిమానులు ఖుషి అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి